‘బాహుబలి 3’ అబ్బే..ఆ విషయం మర్చిపోండి..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి.  ముఖ్యంగా రాజరిక వ్యవస్థపై ఎన్నో జానపద చిత్రాలు వచ్చాయి.  అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు వీరు నటించిన జానపద చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. తర్వాత వచ్చిన జానపద చిత్రాలు పెద్దగా ఆకర్శించలేక పోయాయి.  కానీ దర్శకధీరుడు రాజమౌళి ఐదు సంవత్సరాలు కష్టపడి బాహబలి1, బాహుబలి 2 చిత్రాలు జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులు బద్దలు చేశాయి.  


బాహుబలి సినిమా కోసం ఎంత కష్టపడ్డారో..అంతకు రెట్టింపు ఫలితాన్ని చవిచూశారు. అంతే కాదు తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలు జాతీయ స్థాయిలో గుర్తించబడ్డాయి.  ఈ చిత్రంలో నటించిన నటులకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.  అయితే ఇప్పుడు బాహుబలికి ఉన్న క్రేజ్ దృష్ట్యా బాహుబలి 3 కూడా ఉండబోతుందని ఊహాగానాలు మొదలయ్యాయి.  అంతే కాదు ఆ మద్య రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి మంచి కథ తయారు చేస్తే బాహుబలి 3కి నేను రెడీ అన్నారు.  


కాగా దీనిపై స్పందించిన రాజమౌళి తండ్రి, బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ‘బాహుబలి 2’ తో ఆ కథ పూర్తయిందనీ .. దీనికి సీక్వెల్ వుండే ఛాన్సే లేదని ఒక్క‌ముక్క‌లో తేల్చేశాడు.. 3వ భాగానికి తాను కథ రాయనున్నట్టుగా వస్తోన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని చెప్పారు.  భవిష్యత్ లో బాహుబలి 3 సినిమా తీసే యోచన రాజమౌళికి కూడా లేదని ఖచ్చితంగా చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: