ఖైదీ-శాతకర్ణి "శతమానం భవతి" ఒక అద్భుత విజయం


సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిరంజీవి 'ఖైదీ నంబర్‌ 150', బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాలు అమెరికాలో సందడిచేస్తున్నాయి. ఎక్కువగా హిందీచిత్రాల హవా నడుస్తూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఈ సంక్రాంతికి తెలుగు అగ్రహీరోల చిత్రాలు ఒక్కసారిగా తమదైన శైలిలో అలరిస్తున్నాయి. జనవరి 11 న విడుదలైన చిరు 'ఖైదీ నంబర్‌ 150' అమెరికాలో మంచిటాక్‌ను తెచ్చుకుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. వెండితెరపై చిరంజీవి రీఎంట్రీని చూసి అభిమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిబైపోయారు. 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' అంటూ సందడి చేస్తున్నారు. కలెక్షన్ల పరంగా 'ఖైదీ..' 2 మిలియన్‌ డాలర్ల కు చేరువైందని సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు. శుక్రవారం నాటికి 1,662,963 డాలర్లు(సుమారు రూ.11.33కోట్లు) వసూలు చేసినట్లు తెలిపారు.

 

ఇక బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' అమెరికాలోని తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. బాలకృష్ణ నటన, క్రిష్‌ దర్శకత్వ ప్రతిభకు ప్రవాసులు మంత్ర ముగ్దులవు తున్నారు.హేమమాలిని, శ్రియలనటన, యాక్షన్‌ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో బాక్సాఫీస్‌ వద్ద మంచివిజయాన్ని నమోదు చేసింది. శుక్రవారానికి ఈ చిత్రం 684,771 డాలర్లు (సుమారు రూ.4.67కోట్లు) వసూలు చేసినట్లు తరుణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.

 

సంక్రాంతి సందర్భంగా విడుదలైన శర్వానంద్‌ 'శతమానం భవతి' కూడా అమెరికాలో మంచి టాక్‌ తెచ్చుకుంది. కుటుంబ విలువలను చాటి చెప్పే చిత్రంగా సతీష్‌ వేగ్నేశ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇక చిత్రం 123,679 డాలర్లు(సుమారు రూ.84.29లక్షలు) వసూలు చేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: