'' ఖైదీ నెంబర్ 150'' రివ్యూ రేటింగ్ అదుర్స్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి.   హీరోగా మంచి ఫామ్ లో ఉండగా ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రం తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు.  దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత తిరిగి సినిమాలో నటిస్తున్నారు.  తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ చిత్రం తెలుగు లో ‘ఖైదీ నెంబర్ 150’గా రిమేక్ చేశారు.

ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రేపు భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఇక   యూకే అండ్ యు ఏ ఈ సెన్సార్ బోర్డు మెంబర్ ఫిలిం క్రిటిక్ కూడా అయిన ఉమైర్ సందు ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని చూసి తన రివ్యూ ని ఇచ్చారు.   ఈ చిత్రానికి ఆయన 4/5 రేటింగ్ ఇవ్వడమే కాకుండా సినిమా ఫుల్ మాస్, మెసేజ్ ఓరియెటెండ్ సినిమా అని అన్నారు. అంతే కాదు పూర్తిగా పైసా వసూల్ సినిమా అని తెగ పొగిడేస్తున్నారు.  గతంలో కూడా  ఉమైర్ సందు ‘బాహుబలి’ చిత్రానికి ఇదే స్థాయిలో స్పందించారు.

ఈ చిత్రం ప్రొడక్షన్ వాల్యూస్ , దేవిశ్రీ ప్రసాద్ పాటలు యూత్ ని ఫాన్స్ ని ఉర్రూతలూగించేలా ఉన్నాయని అంటున్నారు.  ఇక థియేటర్లో చిరు డైలాగ్స్ దద్దరిల్లడం ఖాయమని..చిరు స్క్రీన్ ప్రెజెన్స్ కూడా షాక్ అని పదేళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే స్టామినాతో ఉన్నారని అన్నారు.

వినాయక్ దర్శకత్వ ప్రతిభ కాజల్ గ్లామర్ ఈ చిత్రానికి ప్రాణం పోశాయని అన్నారు. ఖైదీ నెంబర్ 150 చిత్రం సంక్రాంతి కి ఫుల్ మీల్స్ అంటూ రివ్యూ ఇచ్చేస్తున్నారు . ఓవరాల్ గా చిరంజీవి 150 వ చిత్రం బాక్సాఫీస్ ని కుమ్మేయడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు . ఏది ఏమైనా చిరంజీవి చాలా కాలం తర్వాత థియేటర్లో సందడి చేయబోతున్నారు..అసలు రివ్యూ ఏంటో రేపు ప్రేక్షకులు తీర్పు ఇవ్వనున్నారు.

ఉమైర్ సందు  ట్విట్ :

Exclusive First Review of #KhaidiNo150 on Twitter ! BLOCKBUSTER ☆☆☆☆ ! Watch it now Mega Star #Chiranjeevi Fans. - https://t.co/r1ePOtsmU2

— Umair Sandhu (@sandhumerry) January 10, 2017 #Chiranjeevi Star Power + Terrific Story & Dialogues + Rocking Music by @ThisIsDSP + Paisa Vasool Action Stunts = #KhaidiNo150 SUPERHIT ☆☆☆☆ pic.twitter.com/vR4PBLrnZJ

— Umair Sandhu (@sandhumerry) January 10, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: