అడవి కాచిన వెన్నెల : రివ్యూ
అరవింద్ కృష్ణ ఒక అసాధారణ శక్తి ఉన్న వ్యక్తి అతను సహజంగానే లోహమున్న ప్రదేశాన్ని గుర్తించగలడు. అలానే తను పలు ప్రదేశాలలో త్రవ్వించి లంకె బిందెలను బయటకి తీస్తాడు కాని అందులో దొరికిన బంగారం మీద ఎటువంటి ఆశ చూపించడు. అతని భార్య పూజ , వీరిద్దరికీ పెళ్లి అయినా కూడా సంతోషంగా ఉండరు. వీరికి పిల్లలు లేకపోవడంతో అరవింద్ ని మరొక పెళ్లి చేసుకోమని కోరుతుంది పూజ కాని అందుకు అరవింద్ ఒప్పుకోడు కాగా ఇదే సమయంలో పూజ రిషి కి దగ్గరవుతుంది. ఈ విషయం తెలిసిన అరవింద్ ఎటువంటి స్పందన చూపించకపోవడం పూజలో పశ్చాతపనికి గురి తీస్తుంది. ఆ తరువాత ఒకరోజు పూజ అరవింద్ ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ తరువాత అరవింద్ జీవితంలోకి ప్రవేశిస్తుంది వెన్నెల(మీనాక్షి దీక్షిత్) అరవింద్ ను ఎలాగయినా తన దగ్గరికి తీసుకొని రావాలని వెన్నెలకి చెప్తాడు ఒఎమ్మార్(వినోద్) తనకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా తన ఇంట్లోనే వెన్నెలను ఉండనిస్తాడు అరవింద్... కాగా ఒకరోజు వెన్నెల తన గతం గురించి అరవింద్ కి చెప్తుంది అది విన్న అరవింద్ తను వెతుకుతున్న సుధర్మ దొరకగానే తనతో పాటు వస్తా అని వెన్నెలకి హామీ ఇస్తాడు.. అసలు సుధర్మ ఏంటి? దాని కోసం అరవింద్ ఎందుకు వెతుకుతున్నాడు? అది అతనికి దొరికిందా లేదా? అసలు వెన్నెల గతం ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం తెర మీద వెతుక్కోవలసిందే..
అరవింద్ కృష్ణ, ముందుగా ఇది ఇతని పాత్ర స్వభావమా లేక నటన ప్రావిణ్యమా అనేది అర్ధం కాలేదు కాని ఈ నటుడు చిత్రం ఆసాంతం అదో రకంగా ప్రవర్తిస్తుంటాడు ఏ రకంగా అని వివరించడానికి పదాలు కూడా దొరకడం లేదు. సరిగ్గా చెప్పాలంటే అన్ని రకాల భావనలకు ఒకేరకమయిన హవాభావం.. సమస్య ఏంటంటే ఈ నటుడు తప్పు ఉన్నట్టు అనిపించలేదు దర్శకుడు ఈ పాత్రా స్వభావం ఇలానే రాసుకున్నారేమో మరి ఏది అయితేనేం చివరి వరకు ఈ నటుడి హావభావాలు ఇతని పాత్ర తీరు తెన్నులు అర్ధం కాకుండానే చిత్రం ముగుస్తుంది.... మీనాక్షి దీక్షిత్ ఈ నటి ప్రధమ కర్తవ్యం అందాల ఆరబోత ఈ పని చాలా అద్భుతంగా చేసింది మరి రెండవ కర్తవ్యం పాత్రకు తగ్గట్టు నటించడం ఈ విషయంలో కూడా ఈ నటి మంచి మార్కులు కొట్టేసింది అనే చెప్పాలి కొన్ని సన్నివేశాలలో సరిగ్గా ఆకట్టుకోలేకపోయినా చాలా సన్నివేశాలలో చాలా బాగా నటించింది అనే చెప్పాలి.. పూజ ఉన్నదీ కాసేపే అయినా ఆ పాత్రకు తగ్గ ప్రదర్శన కనబరిచింది. రిషి రెండు సన్నివేశాలకే పరిమితం అయ్యాడు. వినోద్ కుమార్ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయారు. మిగిలిన నటులు అందరు వారి పాత్రల మేరకు నటించి ఆకట్టుకున్నారు ...
ఈ చిత్ర కథాంశం కొత్తగా ఉంది సుధర్మ అనే ఒక అంశం చుట్టూ కథను అల్లుకున్నారు కాని కథనంలో ఈ విషయం ఎక్కడా తెలుపరు చిత్రంలో డబ్బై శాతం అయ్యే వరకు హీరో దేని కోసం వెతుకుతున్నాడో ఎవరికీ క్లారిటీ ఉండదు. అంతే కాకుండా దీని మీద దృష్టి సారించడం మానేసి మధ్యలో వేరే ట్రాక్ లను తీసుకొని వచ్చి వాటి మీద టైం పాస్ చెయ్యడం నిజంగా విచారకరం. ఒక నూతన దర్శకుడు ఇటువంటి కథాంశాన్ని ఎంచుకొని ఆ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చెయ్యడం అంటే మాటలు కావు ఈ విషయంలో దర్శకుడిని కచ్చితంగా మెచ్చుకొని తీరాలి అంతే కాకుండా ఈ చిత్రం కోసం రాసుకున్న సంభాషణలు చాలా బాగున్నాయి కాని సన్నివేశానికి అనుగుణంగా ఉండి ఉంటె మరింత ప్రభావవంతంగా ఉండేది... ఒక నూతన దర్శకుడు ఈ స్థాయికి రాణించడం నిజంగా అభినందనీయం. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం అందించిన కార్తి రోడ్రిగ్యుజ్ మరియు డా || జ్యోషభట్ల పాటలు చాలా బాగా ఇచ్చారు అంతే కాకుండా వీరి పాటలకి సిరివెన్నెల కలం తోడవడంతో ఆ పాటలకు మరింత అర్ధం చేకూరింది వీరు అందించిన నేపధ్య సంగీతం కూడా ఒక మేరకు ఆకట్టుకోగలిగింది కాని చిత్ర స్థాయిని పెంచే స్థాయిలో నేపధ్య సంగీతం లేదు.. సన్నివేశాలకు బలం చేకూర్చలేకపోయింది అని సింపుల్ గా చెప్పుకోవచ్చు.. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ చాలా ఘోరంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా సన్నివేశాలు పూర్తిగా ఉన్నట్టు అనిపించదు కొన్ని సన్నివేశాలు ఎందుకు ఉన్నాయో అర్ధం కాదు చాలా సన్నివేశాల ఫ్లో మిస్ అయ్యింది వీటన్నింటికి జాగ్రత్తగా కత్తిరించి ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఇంకొంత రిచ్ గా ఉండాల్సింది ...
చరిత్ర ను ప్రస్తుతాన్ని అనుసంధానం చేస్తూ చిత్రం చెయ్యడం అంటే కత్తి మీద నిలబడుకొని డిస్కో డాన్స్ చేసినట్టే అలాంటి ఒక కాన్సెప్ట్ ని ఎంచుకొని దానికి తగ్గ కథనం రాసుకోలేక ఓటమి పాలయిన మరొక యోధుని కథే ఈ అడవి కాచిన వెన్నెల దర్శకుడి కథ.. అవును అతను "సుధర్మ" అనే మంచి కాన్సెప్ట్ ని తీసుకున్నాడు కాని దాని గురించి రెండవ అర్ధ భాగం సగం అయ్యే వరకు కూడా ఎక్కడా ప్రస్తావించరు దర్శకుడు .. నిజానికి ఈలోపు ప్రేక్షకుడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే జుట్టు గట్టిగా పట్టేసుకొని " ఎం జరుగుతుంది రా" అనే అరిచే స్థాయిలో ఉంటుంది... ఒక కథలో హీరో కి ఒక లక్ష్యం ఉండాలి అదేంటో అతనికి తెలియకపోయినా ప్రేక్షకులకి అయినా తెలియాలి లేదా హీరో కి ఏ లక్ష్యం ఉండకూడదు కాని ఈ చిత్రంలో అరవింద్ ఏమో ఒక లక్ష్యంతో పోరాడుతూ ఉంటాడు కాని అదేంటో ప్రేక్షకులకి చెప్పరు. ప్రేక్షకులకి ఎం జరుగుతుందో అర్ధం కాక మరియు కథ ఏటో వెళ్ళిపోతున్నా కూడా హీరో హవాభావంలో తేడా లేకపోవడంతో అది అర్ధం కాక నానా యాతనలు పడ్డారు ఇదంతా ఒక ఎత్తైతే ఈ చిత్రంలో గ్రాఫిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇంతటి ఘోరమయిన గ్రాఫిక్స్ ఈ మధ్య కాలంలో ఏ చిత్రంలో కనబడి ఉండదు అంతే కాకుండా చిత్రం ఆసాంతం లైబ్రరీ షాట్ లతో నింపేశారు కొన్ని సన్నివేశాలను ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించి ఉంటె బాగుండేది.
ఈ చిత్రంలో సుధర్మ గురించి చెప్పిన ఆనిమేటెడ్ కథ చాలా బాగుంది కాని అదే స్థాయిలో చిత్ర కథను కూడా చెప్పి ఉంటె ఇంకా బాగుండేది.. ఇంకా కామెడీ అని అనుకోని తెరకెక్కించిన సన్నివేశాల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. హీరో ని చంపడానికి వచ్చిన ఐదు మందిని హీరోయిన్ చంపేస్తుంది కాని ఆ ఊరిలో పోలీస్ లు కాని చనిపోయిన వారి బంధువులు కాని ఎవరు కాని ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకోరు.. అసలు శవాలు ఏమయ్యాయో కూడా ఎవరికీ తెలియదు.. ఇంతకన్నా ఎక్కువగా ఈ చిత్రం గురించి మాట్లాడలేము .. ఈ చిత్రానికి కొసమెరుపు ఏంటంటే సేక్వేల్ రావడం గ్రాఫిక్స్ ఆఫ్రికా లో ముగిసిన కథ రెండవ భాగంలో అక్కడే మొదలవుతుందేమో చూడాలి.. ఒక్క వాక్యంలో చెప్పాలంటే దర్శకుడిలో మేటర్ ఉంది కాని అది ఎలా చెప్పాలో తెలుసుకొని/నేర్చుకొని చెప్తే మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రాలు తీస్తాడు అన్న నమ్మకం సృష్టించాడు. ఈ చిత్రం అయితే థియేటర్ కి పరిగెత్తుకు వెళ్లి చూడవలసిన చిత్రం కాదు.. ట్రైలర్ చూసి కచ్చితంగా చూడాలి అనిపిస్తే ఓసారి ప్రయత్నించండి...
Arvind Krishna, Meenakshi Dikshit,Akki Viswanadha Reddy,Dr. Josyabatla Sarma.అడవి కాచిన వెన్నెల - బూడిదలో పోసిన పన్నీరు..