ప్రేమకథా చిత్రమ్ : రివ్యూ

Star cast: Sudheer BabuNandithaHansika Motwani
Director: J. Prabhakar Reddy, Producer: Maruthi

Prema Katha Chitram Reviews: Tweet Review | తెలుగు ట్వీట్ రివ్యూ | English Full Review

చిత్రకథ :

సుధీర్ (హీరో శ్రీధర్), నందు( హీరోయిన్ నందిత), వారిద్దరి మితృడు ప్రవీణ్ తో కలిసి  ప్రేమలో ఫెయిలయినందుకు ఆత్మహత్య చేసుకోవడానికి వెలుతారు. దారి మద్యలో వారిలాగే ప్రేమలో ఫెయిలై ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మరొకరు తారసపడి వారితో పాటే కలిసి పోతాడు. ఆనలుగురు ఆత్మహత్య చేసుకోవడానికి అవసరమైన కత్తి, తాడు, పాయిజన్ వంటివన్ని కొనుగోలు చేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న స్పాట్ వారి మితృడికి చెందిన గెస్ట్ హౌజ్ కు చేరుకుంటారు. గెస్ట్ హౌజ్ లో ఏంజరిగింది.. వారు ఆత్మహత్య చేసుకున్నారా... హీరో, హీరోయిన్ లు ప్రేమించుకున్నారా... పెళ్లి చేసుకున్నారా... అనేది తెలుసుకోవాలంటే వెండితెరపై చూడాల్సిందే.


నటీనటుల ప్రతిభ :

హీరో శ్రీధర్ చక్కటి నటన కనబరిచారు, సన్నివేషాలకు తగిన నటన ప్రదర్శించారు. చివరి వరకు హీరోయిజం చూపించే అవకాశం రాకపోయినా క్లయిమాక్స్ లో ఇచ్చిన ఫైట్ సీన్ తో తాను హీరోనే అనిపించుకున్నాడు. ఇక సినిమాకు హైలెట్ హీరోయిన్ నందిత. ఆమె నటన, చలాకి తనం, తన పెద్ద పెద్ద కళ్లతో నటన అదుర్స్ అనిపించింది. సినిమా కథలో కూడా హీరో కన్నా హీరోయిన్ దే ఎక్కువ ఉండడం, దానికి తగ్గ సూపర్ నటనను పాత్రకు, సన్ని వేశాలకు తగినట్టు నటించి సినిమాకే సూపర్ లుక్ ఇచ్చింది. అప్పటి వరకు ప్రేమిస్థున్న యువతిగా, అంతలోనే దయ్యం ఆవహించిన దానిలా నటనను మార్చి మార్చి ప్రదర్శించడంలో అదరగొట్టింది నందిత. ఈ పాత్రలో అపరచితుడు ని తలపించే విధంగా  నటించి శభాష్ అనిపించుకుంది. మరో ప్రధాన పాత్రలో నటించిన ప్రవీణ్, ఆయనకు తోడుగా మరోకరు  సినిమానంతా మొదటి నుంచి చివరి వరకు నవ్వులతో ముంచెత్తించారు. హీరో, హీరోయిన్ లు కూడా పండించిన కామెడీకి వీరిద్దరిది తోడై సినిమాలో హారర్ ఉందన్న విషయాన్నే తెలియనీయలేదు.

సాంకేతిక వర్గం పనితీరు :

డైరెక్షన్ బాగుంది. కథకు తగ్గట్టుగా నడిపించి మరో చూడదగ్గ సినిమాను ప్రేక్షకులకు అందించారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సూపర్ విజన్ చేసిన మారుతి శ్రమ హైలెట్. మంచి కథను అందించడమే కాకుండా దానికి తగ్గ స్క్రీన్ ప్లే అందించి సినిమాను సక్సెస్ చేసారు. పాటలు, సంగీతం ఈసినిమాలో ఫెయిలయ్యాయి. అయితే సినిమా కథకు  పాటలు, సంగీతం అంత ప్రాధాన్యతాంశాలు కావు.

హైలెట్స్ : 

ఇంటర్ వెల్ బ్రేక్ అదిరింది. ఇక ప్రేమ పాకంలో పడింది, సినిమా ముగింపుకు వస్థుంది అనే సమయంలో ఇచ్చిన ట్విస్ట్ ఇంకా సూపర్. సినిమా లో కామెడీ వెరీ హైలెట్, సస్సెన్స్ కూడా సూపర్బ్.

విశ్లేషణ : 

 ప్రేమకథా చిత్రమ్ అనే బదులు ప్రేమకథా కామెడి చిత్రం అనిపించింది. ఝలధరించే సీన్ తో ఆరంభం అయి వామ్మో... సినిమా ఎంత భయంకరంగా ఉంటుందో అని ఊహించుకున్న ప్రేక్షకునికి అంతకంటే డబుల్ కామెడి చూపించి కడుపబ్బనవ్వించారు. కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమా. ఇక సినిమాలో ట్విస్ట్ లు, సస్సెన్స్ అన్ని సూపర్ అలరిస్థాయి. ఆత్మహత్యలు చేసుకోవాలను కోవడం ఏమిటి, దానికి బ్రహ్మాండం బద్దలయ్యే లెవల్లో ప్లానింగ్ ఏంటి, ఆక్రమంలో చిత్రంలో కామెడి, హారర్, సస్సెన్స్ ఇలా అన్ని కలగలిపి ప్రేక్షకుని రంజింప చేయడం అంతా సూపర్.

చివరగా : 

హారర్ కథాంశంతో నలుగురితోనే సినిమాను ఇంత కామేడీగా సినిమా తీయగలం  అని చూపించిన సినిమా.

Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com; 
Call: +91-40-4260-1008

More Articles on Prema Katha Chitram | Prema Katha Chitram Wallpapers | Prema Katha Chitram Videos



" height='150' width='250' width="560" height="315" src="https://www.youtube.com/embed/IwWpGlST1Wk" data-framedata-border="0">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: