తమిళ హీరో విజయ్ గొప్పతనానికి హేట్సాఫ్ అంటున్న కోలీవుడ్

Murali

ఓ స్టార్ హీరో తన సినిమాకు పనిచేసిన వారిని అభినందించడం సహజమే. కానీ షూటింగ్ పూర్తయ్యాక వారికి చాలా ఖరీదైన బహుమతి ఇస్తే వారి ఆనందానికి హద్దులుండవు. తమిళ హీరో ఇళయదళపతి విజయ్ అదే పని చేసి తన యూనిట్ ను ఆశ్చర్యపరిచాడు. అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న ‘బిగిల్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దాంతో.. యూనిట్ సిబ్బందికి షూటింగ్ జ్ఞాపకంగా ఓ బహుమతి ఇవ్వాలని భావించాడు.



అనుకుందే తడవుగా యూనిట్ లోని 400 మంది సిబ్బందికి ‘బిగిల్’ అని రాసున్న ఒక్కో గోల్డ్ రింగ్ ను బహుకరించాడు. దీంతో ఆశ్చర్యపోవటం యూనిట్ వంతైంది. ప్రస్తుతం ఈ విషయం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఏజీఎస్ సినిమా ప్రతినిధి అర్చనా కల్పతి ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. “ఈ రోజు హీరో విజయ్ తమకెంతో జ్ఞపకాన్ని మిగిల్చారు. 400 మంది సిబ్బందికి అమూల్యమైన బహుమతినిచ్చి సంతోషపరిచారు” అంటూ ట్వీట్ చేశారు. తమిళ్ లో రజినీ కాంత్ తర్వాత ఆస్థాయి స్టార్ డమ్ ఉన్న హీరో విజయ్ కొత్త సినిమా వస్తుందంటే తమిళనాట హడావిడి ఓ స్థాయిలో ఉంటుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ రౌడీ, మహిళా ఫుట్ బాల్ కెప్టెన్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దీపావళికి ఈ సినిమా విడుదలకానుంది.



తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవి 1998లో చూడాలని ఉంది సినిమా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో టెక్నీషియన్లకు గోల్డ్ చైన్స్ బహుకరించారు. రీసెంట్ గా మహేశ్ భరత్ అను నేను సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేసిన వారందరికీ ఐఫోన్లు బహుమతిగా ఇచ్చాడు. ఇటువంటి సందర్భాలు ఎంతో సహృద్భావ వాతావరణాలు కల్పిస్తాయనడంలో సందేహం లేదు.


#Bigil has a team of 400 members working in the film everyday Our Thalapathy made it extra special by valuing each an every individual’s contribution today. This token of affection coming from him made everyone’s day #PositiveVibes #HeartOfGold #OurThalapathyIsTheBest 😊😊

— Archana Kalpathi (@archanakalpathi) August 13, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: