పెళ్లిపై ఫరియా అబ్దుల్లా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు. మరి ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటారు అని చెప్పాలి. నేటి తరంలో అలాంటి హీరోయిన్లలో ఫరియా అబ్దుల్లా కూడా ఒకరు. జాతి రత్నాలు అనే చిన్న సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే మొదటి సినిమాను సూపర్ హిట్ కావడంతో ఫరియా అబ్దుల్లా యూత్ అందరికి బాగా కనెక్ట్ అయిపోయింది. చిట్టి అనే పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది ఫరియా.

 ఇక తన అందం అభినయంతో కూడా ఆకట్టుకుంది అని చెప్పాలి. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ వస్తుంది. అయితే ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా అల్లరి నరేష్ తో ఆ ఒక్కటి అడక్కు అని సినిమాలో నటించింది. ఇక ఈ మూవీ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతుంది ఫరియా అబ్దుల్లా. ఈ క్రమంలోనే తన ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు.. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ అమ్ముడు పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 పెళ్లి విషయంలో తనకంటూ కొన్ని స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి అంటూ చెబుతోంది ఈ హైదరాబాద్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. 30 ఏళ్ళు దాటిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే కచ్చితంగా ప్రేమ వివాహాన్ని చేసుకుంటారని.. తన మనసులోని మాటను వెల్లడించింది. అంతేకాదు కెరియర్లో ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఎంతో ఇష్టపడతానని.. ఇక అలాంటి రూల్స్ వస్తే తప్పకుండా ఓకే చెబుతాను అంటూ చెబుతోంది. కాగా ఆ ఒక్కటి అడక్కు సినిమా మే మూడవ తేదీన పరీక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: