"ఐపీఎల్ 2024" లో అత్యల్ప సిక్సర్స్ ఇచ్చింది వీరే... టాప్ ప్లేస్ లో ఆ స్టార్ బౌలర్..?

Pulgam Srinivas
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పీ ఎల్) 2024 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి ప్లే ఆప్స్ లోకి వెళ్ళిపోయాయి. మరో రెండు ప్లే ఆప్స్ స్థానాల కోసం కొన్ని జట్లు పోటీ పడుతున్నాయి. మరి మిగిలిన ఆ రెండు స్థానాలలోకి ఎవరు వస్తారు అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఐ పి ఎల్ అంటేనే భారీ స్కోరులు , ఓ టీం భారీ కోర్ ను సాధిస్తే దానిని మరెవరైనా బీట్ చేస్తే ఆ మ్యాచ్ జనాల్లోకి భారీగా వెళుతూ ఉంటుంది.

ఇకపోతే సిక్సులు కూడా భారీగా కొడితే ప్రేక్షకులు ఎంతగానో ఆనందపడతారు. దానితో ఐ పీ ఎల్ మ్యాచ్ లలో భారీ సిక్స్ లకి కరువే ఉండదు. ఇకపోతే ఇప్పటి వరకు ఐపీఎల్ 2024 లో బౌలింగ్ వేసిన అనేక మంది బౌలర్ లలో చాలామంది భారీ సిక్స్ లను సమర్పించుకోగా మరి కొంత మంది మాత్రం చాలా పొదుపుగా సిక్స్ లను ఇచ్చారు. అందులో భాగంగా ఈ ఐపీఎల్ సీజన్ లో అతి తక్కువ సిక్స్ లను ఇచ్చిన బౌల్లెర్స్ ఎవరో తెలుసుకుందాం. టీ మీడియాలో స్టార్ బౌలర్ అయినటువంటి బూమ్రా ఈ సీజన్ లో 311 బంతులను వేసి కేవలం 10 సిక్స్ లను మాత్రమే ఇచ్చాడు.

ఇక జడేజా 264 బంతులను వేసి కేవలం 10 సిక్స్ లను మాత్రమే ఇచ్చాడు. బోల్ట్ 254 బంతులను వేసి 11 సిక్సార్ లను ఇవ్వగా , దయాల్ 259 బంతుల్లో 11 సిక్స్ లను ఇచ్చాడు. అశ్విన్ 258 బంతుల్లో 14 సిక్స్ లను ఇవ్వగా , సునీల్ నరైన్ 282 బంతుల్లో 14 సిక్స్ లను ఇచ్చాడు. భువనేశ్వర్ 270 బంతుల్లో 15 సిక్స్ లు ఇవ్వగా , తుషార్ దేశ్ పాండే 264 బంతుల్లో 15 సిక్స్ లను ఇచ్చాడు. అక్షర పటేల్ 264 బంతుల్లో 15 సిక్స్ లను ఇచ్చాడు. ఇక ఈ సీజన్ లో టీమిండియా స్టార్ బౌలర్ బూమ్రా 311 బంతులను వేసి కేవలం 10 సిక్స్ లను మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాతే స్థానంలో జడేజా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: