గౌతమ్, నేను సుమారు మూడు సంవత్సరాలు డేటింగ్ చేశాం.. కాజల్..!?

Anilkumar
కళ్యాణం సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమయ్యింది చందమామ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత మగధీర సినిమాతో మిత్రవిందగా అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఆ తర్వాత ఆర్య 2 డార్లింగ్ బృందావనం మిస్టర్ పర్ఫెక్ట్ బిజినెస్ మాన్ బాద్షా టెంపర్ నాయక్ వంటి అన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ అన్ని సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఈ సినిమాల తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది చందమామ కాజల్ అగర్వాల్. దాంతో రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను కాజల్ అగర్వాల్ చేయడం మానేసింది. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంది కాజల్ అగర్వాల్.

 ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది సినిమాలు అయినా వెబ్ సిరీస్ అయినా సరే తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే మాత్రమే ఆ సినిమాలను ఎంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సత్యభామ సినిమా. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా బిజీగా ఉంది కాజల్ అగర్వాల్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ కార్యక్రమానికి ఇంటర్వ్యూ వచ్చింది. ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా తమది ప్రేమ వివాహమా లేదా పెద్దలకు కుదిర్చిన వివాహమా అన్నదానికి సమాధానమిచ్చింది..

 కాజల్ మాట్లాడుతూ మాది ప్రేమ వివాహం. మేం ప్రేమించుకుని.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మొదటిసారి నేను గౌతమ్‌ కిచ్లూని స్నేహితుల పెళ్లిలో కలిశాను. గౌతమ్, నేను సుమారు మూడు సంవత్సరాలు డేటింగ్ చేశాం. ఆపై ఏడేళ్లుగా ఫ్రెండ్స్‌గా ఉన్నాం. కరోనా టైమ్‌లో మేము కొన్ని వారాలపాటు కలుసుకోలేదు. మాస్క్ వేసుకుని ఒక కిరాణా దుకాణంలో కలిసాము. అప్పుడే మాకు అర్ధమైంది మేము ఎంతలా ప్రేమించుకుంటున్నామో. ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’ అని అన్నారు... ‘నాకు తెలుగు సంప్రదాయాలంటే చాలా ఇష్టం. అందుకే నా పెళ్లిలో కొన్ని క్రతువులు మన సంప్రదాయానికి సంబంధించినవి కూడా ఉండేలా చూసుకున్నా. తెలుగులో నాకు ఎన్నో ఫేక్‌ పెళ్లిళ్లు చేసేశారు. అందుకే నిజం పెళ్లి కూడా అదే సంప్రదాయంలో చేసుకున్నా’ అని కాజల్ అగర్వాల్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: