టీ20 వరల్డ్ కప్ లో ఒక్క వార్మప్ మ్యాచ్ మాత్రమే ఆడనున్న ఇండియా..!

Pulgam Srinivas
ప్రస్తుతం ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో ఇండియా జట్టు ఆటగాళ్లు అంతా బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఐపీఎల్ 2024 చివరి దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఐపీఎల్ సీజన్ కంప్లీట్ కాబోతోంది. ఇక ఈ సీజన్ పూర్తి కాగానే ఇండియా జట్టు టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఆడబోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆటగాళ్లను కూడా బీసీసీఐ సెలెక్ట్ కూడా చేసింది. టి20 వరల్డ్ కప్ 2024 కి రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు.

ప్రతిసారి టి20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు టీం ఇండియా జట్టు రెండు వార్మప్ మ్యాచ్ లను ఆడుతూ ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం భారత జట్టు కేవలం ఒకే ఒక వార్మాప్ మ్యాచ్ ఆడబోతున్నట్లు తెలుస్తోంది. మొదటగా టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా జట్టుకు రెండు వార్మాప్ మ్యాచ్ లను ఆడించాలని ఐసీసీ బోటు అనుకున్నప్పటికీ ఒకటి న్యూయార్కు లోనూ , మరొకటి ఫ్లోరిడా లోనూ నిర్వహించాలని ఐసీసీ బోర్డు అనుకుందట. కాకపోతే బీసీసీఐ బోర్డు మాత్రం రెండింటిని కూడా న్యూయార్కు లో నిర్వహిస్తే బాగుంటుంది అనే ప్రతిపాదనను తీసుకువచ్చిందట.

కానీ ఐసీసీ బోర్డు మాత్రం దానికి సానుకూలంగా స్పందించకపోవడంతో ఒక్క మ్యాచ్ కోసం న్యూయార్క్ నుండి ఫ్లోరిడా వరకు వెళ్లడం అనవసరం అనే ఉద్దేశంతో ఒక్క వార్మప్ మ్యాచ్ తోనే సరిపెట్టుకుందాం అని ఇండియా జట్టు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే టి20 వరల్డ్ కప్ సిరీస్ పై ఇండియా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా జట్టు కచ్చితంగా గెలుస్తుంది అని భారత అభిమానులు ఎంతో ఆశతో ఉన్నారు. మరి భారత్ జట్టు ఇండియా అభిమానులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: