రోబోతో ప్రేమ.. పెళ్లికి కూడా రెడీ అయ్యాడు?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం అన్న విషయం తెలిసిందే. ఒంటరిగా సాగిపోతున్న జీవితానికి తోడు నీడని ఇస్తూ ఉంటుంది. ఇక జీవిత భాగస్వామితోనే కష్టసుఖాలను పంచుకుంటూ లైఫ్ మొత్తం ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే పెళ్లి విషయంలో యువతీ యువకులు ఇద్దరు కూడా కోటి ఆశలను పెట్టుకుంటారు. తమను అర్థం చేసుకునే భాగస్వామి తమ జీవితంలోకి వస్తుందని అబ్బాయిలు అనుకుంటే.. తనను రాణిలా చూసుకునే భర్త వస్తాడని అమ్మాయిలు ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం నేటి రోజుల్లో పెళ్లి విషయంలో చిత్ర విచిత్రంగా ఆలోచిస్తున్నారు. ఏకంగా అబ్బాయిలు మరో అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అమ్మాయిలు ఇంకో అమ్మాయితో వైవాహిక బంధాన్ని కొనసాగించాలని అనుకోవడం ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో చాలానే వెలుగులోకి వస్తున్నాయ్. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది అయితే మరింత విచిత్రకరమైన ఘటన. సాధారణంగా మనుషులకి మిషన్లకి మధ్య ప్రేమ పుడుతుందా.. ప్రేమ పెళ్లి వరకు వెళుతుందా అంటే శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమాలో మాత్రమే అది సాధ్యమవుతుంది అని అంటారు ఎవరైనా.

 కానీ ఇక్కడ రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.  ఏకంగా రోబో సినిమాలో ఐశ్వర్యరాయ్ తో చిట్టి ప్రేమలో పడినట్లుగానే రాజస్థాన్ కు చెందిన సూర్య ప్రకాష్ అనే రోబోటిక్స్ నిపుణుడు ఒక మిషిన్ తో ప్రేమలో పడ్డాడు. గిగా అనే రోబో 19 లక్షల రూపాయల ఖర్చుతో తయారవుతుంది. అయితే ఈ రోబోతో సూర్యప్రకాష్ ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడటమేనా ఏకంగా పెళ్లి చేసుకునేందుకు కూడా రెడీ అయ్యాడు. అయితే ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెబితే మొదట షాక్ అయినప్పటికీ తర్వాత ఒప్పుకున్నారట. కాగా సూర్యప్రకాష్ త్వరలోనే నేవీలో విధులు నిర్వహించబోతున్నారు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: