తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ సాధిస్తారు. అలాంటి వారిలో ప్రముఖ నటి హనీ రోజ్ ఒకరు. ఈ భామ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించి సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ గా తన సత్తాను చాటుకుంది. హీరోయిన్ కావాలనే ఆశతో సినీ పరిశ్రమకు పరిచయమైంది. కానీ తనలోని టాలెంట్ ను ఎవరు పెద్దగా గుర్తించలేకపోయారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సినిమాలకు పరిమితమైంది.
అనేక సినిమాలలో నటించిన ఈ అమ్మడు బాలయ్య బాబు నటించిన వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇందులో బాలయ్యకు మరదలు పాత్రలో నటించి తన నటన, అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఆ సినిమా తర్వాత అనేక సినిమాలలోనూ హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది. తెలుగులోనే కాకుండా అనేక భాషా సినిమాలలో అవకాశాలను అందిపుచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి కోట్లలో డబ్బులను సంపాదించింది.
షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లాంటి కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంది. అమ్మడికి సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. హనీ రోజ్ సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ఓ మేనేజర్ తో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగించిందట. అంతే కాకుండా ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. చాలా కాలం పాటు డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నారట అనంతరం ఏమైందో తెలియదు. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఆ మేనేజర్ వేరే అమ్మాయిని వివాహం చేసుకొని పిల్లలకు కూడా జన్మనిచ్చాడు. కానీ హనీ రోజ్ మాత్రం ఇంకా సింగిల్ గానే తన లైఫ్ కొనసాగిస్తోంది. రీసెంట్ గానే ఓ హీరోతో ప్రేమలో ఉందని మళ్లీ ఓ వార్త వినిపిస్తోంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది.