ప్రముఖ టాలీవుడ్ నటి ప్రణీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ తెలుగులో అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగించింది. ప్రణీత తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు పొందింది. మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో ఎలాగైనా సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో ఈ చిన్నది నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలిచాయి.
ప్రణీతకు విపరీతంగా అభిమానులు ఉన్నారు. ఈ భామ వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే.... ఈ బ్యూటీ సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును 2021లో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా ప్రణీత సినిమాల్లో నటించింది. ప్రణితకు ప్రస్తుతం ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రణీత తన భర్త, పిల్లలతో కలిసి తన సమయాన్ని గడుపుతోంది. వారిని దగ్గర ఉండి చూసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రణీతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.
ప్రణీత తన భర్తతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా సినీ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అవుతుంది. గత కొద్ది రోజుల నుంచి ప్రణీత, నితిన్ మధ్య గొడవలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. నేటి కాలంలో సినీ పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు విడాకులు చాలా కామన్ అయిపోయాయి. పిల్లలు ఉన్నప్పటికీ విడిపోవడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. చాలామంది సెలబ్రిటీలు ఇలానే చేస్తున్నారు. ఈ కోవలోకి ప్రణీత చేరడంతో తన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ వార్తలపై ప్రణీత ఎలా స్పందిస్తుందో చూడాలి.