ఆ విషయంలో కుర్రాళ్లతో పోటీ పడుతున్న బాలయ్య.. సక్సెస్ అవుతాడా?

frame ఆ విషయంలో కుర్రాళ్లతో పోటీ పడుతున్న బాలయ్య.. సక్సెస్ అవుతాడా?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ అంటే తెలియని వారుండారు. ఆయనకు యంగ్ స్టార్స్ నుండి ఏజ్ అయిన వాళ్లదాకా ఫాన్స్ ఉన్నారు. బాలయ్యకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలన్ని హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగింది. ఇక ఇటీవలే బాలకృష్ణ దర్శకుడు బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ సినిమా థియేటర్ లో విడుదల అయ్యి.. మంచి హిట్ ని అందుకుంది. ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ లో కూడా చెరిపోయింది.

అయితే బాలయ్య బాబు సినిమాల గురించి మాట్లాడితే మొదట గుర్తు వచ్చేది ఆదిత్య 369. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కొట్టింది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ సినిమాను బీట్ చేసే మూవీ రాలేదు. ఈ సినిమాకు శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఈ సినిమా 1991లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎస్పీ బాలసుబ్రమణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివాలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 11న రీరిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా ఇప్పటి యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ విషయంలో బాలయ్య బాబు, కుర్రాళ్లతో పోటీ పడుతున్నాడు. మరి సక్సెస్ అవుతాడా లేదా చూడాలి.

 
ఇదిలా ఉండగా.. బాలయ్య బాబు అఖండ 2: తాండవం సినిమా కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందే. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మరో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతుంది. అయితే ఈ సినిమాను తెరకెక్కించేందుకు షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: