కోర్ట్ మూవీ హీరోయిన్ ఎవరో తెలుసా.. తెలుగమ్మాయే.. ఈమె ప్రత్యేకతలు ఏంటంటే?
కోర్ట్ సినిమా డైరెక్టర్ రామ్ జగదీష్ కాగా రామ్ జగదీష్ ఫ్రెండ్ ఆయనకు పంపిన ఇన్ స్టా రీల్ శ్రీదేవి కెరీర్ నే మార్చేసింది. శ్రీదేవి అడిషన్ ద్వారా ఈ సినిమాకు ఎంపిక కాగా టీనేజ్ అమ్మాయి పాత్రలో ఈ బ్యూటీ అదరగొట్టారు. ప్రేమలో సాంగ్ కోర్ట్ సినిమా రేంజ్ ను మరింత పెంచింది. విజయ్ బుల్గేనిన్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. జాబిలి పాత్రకు శ్రీదేవి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
శ్రీదేవి ఆపళ్లకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని మూవీ ఆఫర్లు రావడం పక్కా అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. శ్రీదేవి ఆపళ్లకు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 2,35,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫస్ట్ మూవీతోనే ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకోవడం సులువైన విషయం కాదు. రాబోయే రోజుల్లో శ్రీదేవి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
శ్రీదేవి సరిగ్గా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే మరిన్ని విజయాలు సాధించడం పక్కా అని చెప్పవచ్చు. కోర్ట్ మూవీ కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. 2024 సంవత్సరంలో చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా హనుమాన్ మూవీ నిలవగా 2025 సంవత్సరంలో మాత్రం కోర్ట్ నిలిచే అవకాశం ఉంది. విడుదలకు ముందు పెద్దగా అంచనాలు ఏర్పడకపోయినా రిలీజ్ తర్వాత మాత్రం ఈ సినిమా అదరగొడుతోందనే చెప్పాలి.