అరే ఏందిరా బాబు .. అప్సరసలాంటి బ్యూటీ ని ఎలా మార్చేశారు .. ఈ గోస్ట్ ఎవరో గుర్తుపట్టారా..?

frame అరే ఏందిరా బాబు .. అప్సరసలాంటి బ్యూటీ ని ఎలా మార్చేశారు .. ఈ గోస్ట్ ఎవరో గుర్తుపట్టారా..?

Amruth kumar
ఇక మన టాలీవుడ్లో మసూద సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టిన బ్యూటీ బాంధవీ శ్రీధర్ .. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది .. ఇందులో దేయ్యం పట్టిన అమ్మాయిగా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది .. అయితే ఈ సినిమాలో దెయ్యం పట్టినట్లుగా పిచ్చిగా కనిపించిన బాంధవీ శ్రీధర్ సోషల్ మీడియా మాత్రం ఎంతో గ్లామర్ గా మెరిసిపోతూ కనిపిస్తుంది .. అయితే ఇప్పుడు మరో అమ్మాయి సైతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది .. రీసెంట్గా ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన శబ్దం సినిమాలో ఈమె నటించిన ఈ బ్యూటీ .. గత నెలలో విడుదలైన శబ్దం సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఆది పినిశెట్టి ,  డైరెక్టర్ అరివళగన్ , మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది .

హారర్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో దెయ్యంగా నటించింది ఓ అందాల బ్యూటీ .. ఆమె పేరు ఆర్తి అశ్విన్ , కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది ఈ బ్యూటీ .. తమిళనాడులోని  మైలదుత్తురైలో జన్మించిన ఈ బ్యూటీ ఎలాంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది .. గాయ‌ని కావాలనేది ఆమె కల .  అలా అనుకోకుండా సినిమాల్లో అడుగుపెట్టి నటిగా మారింది .. కాలేజీ రోజుల్లోనే పలు టెలివిజన్ రియాల్టీ షోలకు అడిషన్స్ ఇచ్చింది .. ఆ తర్వాత బుల్లితెరపై పలు షోలలో కూడా ఈమె సందడి చేసింది.

మోహన్ జి దర్శకత్వం దర్శకత్వ వహించిన రుద్ర తాండవం సినిమాతో నటిగా ఈమె చిత్ర పరిశ్ర‌మ‌కు పరిచయమైంది .. ఇందులో ఈమె రిపోర్టర్ పాత్రలో నటించింది .. ఈ మూవీ తర్వాత ఆర్తి అశ్విన్ కు మరింత క్రేజ్ వచ్చింది .  ఇక తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కూడా చేసింది ఆర్తి .  ఇక ఇప్పుడు శబ్దం సినిమాతో మరింత క్రెజ్  తెచ్చుకుంది . ఇక ఇందులో ఈమె అసలు ఎవరు గుర్తుపట్టలేనంతగా చూపించారు మేకర్స్ .. మేకప్ కోసమే దాదాపు నాలుగు గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చిందని కూడా అంటారు .. ఇక ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినట్లు కూడా చూపుతుంది ఆర్తి .. ఇక ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులోనూ నటించేందుకు రెడీ అవుతుంది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్యూటీ కి సంబంధించిన క్రేజీ ఫోటోలు వైరల్ గా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: