ప్రస్తుతం ఏ థియేటర్లలో చూసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమానే అదరగొట్టేస్తోంది.. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయినటువంటి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని చెప్పవచ్చు. అలాంటి ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేటట్టు తెరకెక్కించారు. అంతేకాదు ఇందులో హీరో వెంకటేష్ సరసన మన తెలుగు అమ్మాయి అయినటువంటి ఐశ్వర్య రాజేష్ ను కథానాయికగా తీసుకున్నారు. ఈమె తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయి అయినా కానీ తమిళ్ లో స్టార్ హీరోయిన్ అయింది. ఇలాంటి అమ్మాయికీ ప్రస్తుతం వెంకటేశ్ తో నటించే అవకాశం రావడంతో ఆమె టాలెంట్ ఎంతో నిరూపించుకుంది. ముఖ్యంగా ఇందులో వెంకీ భార్యగా అద్భుతంగా నటించింది అని చెప్పవచ్చు.
ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ ను ఎంతో లవ్ చేసే భార్యగా, అలాగే తనకు వేరే అమ్మాయితో రిలేషన్ ఉందని తెలిసి అనుమానంతో ఆడుకునే భార్యగా రెండు రకాల కోణాల్లో నటించింది. ఏది ఏమైనా ఇందులో వెంకటేష్ పాత్రని ఆమె డామినేట్ చేసే విధంగా నటించిందని చెప్పవచ్చు. ఇక ఈమె నటన గురించి పక్కన బెడితే ఐశ్వర్య రాజేష్ అప్పట్లో పెద్ద స్టార్ హీరో అని చాలామందికి తెలియదు. ఆయన తెలుగులో ఎన్నో చిత్రాలు చేశారు.. ముఖ్యంగా జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన నెలవంక చిత్రంలో రాజేష్ హీరోగా నటించారు.
ఇక ఇవే కాకుండా ఆనంద భైరవి, రెండు జెళ్ళ సీత , చిరంజీవి హీరోగా చేసిన పల్లెటూరి మొనగాడు చిత్రంలో విలన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా ఇదే కాకుండా బాలకృష్ణ, కృష్ణంరాజు నటించిన ఎన్నో చిత్రాల్లో విలన్ గా చేశాడు. అప్పట్లోనే 50కి పైగా చిత్రాలు చేసి స్టార్ నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన తాగుడుకు బానిస అవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడి చివరికి 38 ఏళ్ల వయసులోనే మరణించారు. ఈయన చనిపోయే సమయానికి ఐశ్వర్య వయసు 8 సంవత్సరాలు. చివరికి తన తల్లి నాగమణి అన్ని తానై చూసుకొని తన కూతుర్ని పెద్ద హీరోయిన్ ని చేసిందని చెప్పవచ్చు..