స్టార్ హీరో శివన్న ఆరోగ్యం పై.. కూతురు ఎమోషనల్ పోస్ట్..!

Divya
టాలీవుడ్, కోలీవుడ్, కన్నడ ఇండస్ట్రీలో తనకంటు ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నాడు నటుడు శివరాజ్ కుమార్. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఇటీవలే అమెరికాలోకి వెళ్లి మీయామీ క్యాన్సర్ సెంటర్ లో చికిత్స తీసుకుంటున్నట్లు  తెలియజేశారు. అయితే ఈ శస్త్ర చికిత్స కూడా విజయవంతంగా పూర్తి అయ్యిందని సర్జరీ చేసినటువంటి వైద్యుడుతో స్వయంగా ఒక వీడియో తీసి శివన్న ఆరోగ్యం పైన సమాచారాన్ని అందించారు. ఈ విషయాన్ని తన చిన్న కుమార్తె నివేదిత తన తండ్రి ఆరోగ్యం గురించి అభిమానులతో పంచుకుంది.

అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుడు దయవల్ల మా నాన్నగారి సర్జరీ విజయవంతంగా అయ్యిందని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కూడా నిలకడగానే ఉన్నదని దీనికి ప్రధాన కారణం మియామీ హెల్త్ కేర్ వైద్య బృందం అంటూ తెలియజేసింది. ఈ సర్జరీలో తమ కుటుంబానికి అన్ని విధాల సహకరించిన మురుగేషన్ మనోహర్ గారికి సైతం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ తెలిపింది.. ఇక అభిమానులను ఉద్దేశిస్తూ మీ అందరి ప్రేమ ప్రార్థనలు ఆశీర్వాదాల వల్లె మాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి మీరు చూపుతున్న ఈ ప్రేమాభిమానాలు ఇలాగే కొనసాగి తమకు శక్తినివ్వాలి అంటూ తెలియజేసింది. అందరికీ రుణపడి ఉంటామంటూ తెలిపింది.

శివరాజ్ కుమార్ గత కొన్ని నెలలుగా మూత్ర క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారని..అందుకు చికిత్స కోసం అమెరికాకు వెళ్లే సమయంలో చాలామంది సినీ పరిశ్రమకు చెందినవారు ఆయన అభిమానులు ఇంటికి చేరి వీడ్కోలు పలకడం జరిగింది. నిన్నటి రోజున శస్త్ర చికిత్స జరుగుతుందని తెలియడంతో చాలాచోట్ల ఈయన అభిమానులు ఆలయాలలో ప్రత్యేకమైన పూజలు కూడా చేయించడం జరిగింది. అయితే ఈ సర్జరీ తర్వాత శివన్న కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలట. జనవరి 25న కర్ణాటకకు తిరిగి రాబోతున్నట్లు సమాచారం.అప్పటివరకు ఆయన అమెరికాలోనే ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం అభిమానులకు కాస్త ఆనందాన్ని కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: