చరిత్ర సృష్టించిన పుష్ప-2.. మరో సంచలన రికార్డు?

praveen
ఒకవైపు పుష్ప సినిమా విడుదల సందర్భంలో సంధ్య థియేటర్ వద్ద చెలరేగిన వివాదం విషయమై అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే, మరోవైపు ఈ సినిమా కలెక్షన్ల విషయంలో మునిపెన్నడూ మరే భారతీయ సినిమా ఛేదించలేని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ బక్షాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. అవును.. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్‌’ల తర్వాత ఆ స్థాయిలో సీక్వెల్‌పై అంచనాలు క్రియేట్ చేసిన సినిమా ‘పుష్ప2’గా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే పుష్ప సినిమా సీక్వెల్‌పై అంచనాలను నిజం చేస్తూ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక మూడేళ్ల కిందట ఈ సినిమా పార్ట్ 1 ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై హిందీ బెల్టులో రూ.100 కోట్లు కొల్లగొట్టి సంచలనాలు సృష్టించింది.
తరువాత సరిగ్గా మూడేళ్లకు సీక్వెల్‌తో వచ్చి ఇపుడు ఊచకోత సృష్టిస్తున్నాడు ఐకాన్ బాబు. అవును, పుష్ప ఊచకోతకు ఇపుడు ఏ రికార్డు మిగలడం లేదు. సినిమా రిలీజై 3 వారాలు దాటుతున్నా.. చాలా చోట్ల థియేటర్‌లు 60 శాతానికి పైనే నిండుతున్నాయి. కేవలం వీకెండ్స్ మాత్రమే కాకుండా వీక్ డేస్‌లో కూడా పుష్ప సినిమా రచ్చ రచ్చ చేస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కొత్త సినిమాలు ప్రతీ వారం రిలీజ్ అవుతున్నప్పటికీ పుష్ప2 దాటికి సౌండ్ కూడా వినిపించడం లేదు. సౌత్ టు నార్త్ వరకు ఏ రికార్డును కూడా వదలడం లేదు. రపా రపా రికార్డులన్ని పుష్ప కొల్లగొడుతున్నారు.
మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమా హిందీలో ఇండస్ట్రీ హిట్టు కొట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వందేళ్ల బాలీవుడ్ చరిత్రలో పుష్ప2 సినిమా సరికొత్త రికార్డులను సృష్టించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అవును, కేవలం హిందీలో ఈ సినిమా ఇప్పటివరకు రూ.700 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. బాలీవుడ్‌లో ఇదే హయ్యెస్ట్ కావడం విశేషం. నార్త్ ప్రేక్షకులు మొత్తం.. పుష్ప2 సినిమాను వాళ్ల సొంత సినిమాలానే… రిపీటెడ్‌గా చూస్తున్నారట. ఒక తెలుగు సినిమాకు ఇంత కంటే గొప్ప విషయం ఏముంటుందని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక కేవలం ముంబైలోనే ఈ సినిమాకు రూ.250 కోట్ల కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం. వాస్తవానికి ముంబైలో రూ.250 కోట్లు అనేది.. స్టార్ హీరోల డ్రీమ్ కలెక్షన్లు. ఇదిలా ఉంటే ఈ సినిమా తాజాగా రూ.1700 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మరో వంద కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొడితే బాహుబలి2 రికార్డు కూడా బ్రేక్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: