ఇంట్లో ఇల్లాలు.. షూటింగ్లో ప్రియురాలు.. మెగాస్టార్ లవ్ స్టోరీ గురించి తెలుసా?
సాధారణంగా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి చాలా కామన్. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి తో కలిసి తిరిగితే వారి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఏదో ఒక రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది మీడియా. ఈ రూమర్స్ అనేవి రియల్ లైఫ్ లోను.. రీల్ లైఫ్ లోను.. ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తాయి. ఇందులో కొన్ని రూమర్సులలో నిజాలు లేకపోలేవు. అయితే వాటిని తప్పు అని ఒప్పుకునేవారు కొందరు మాత్రమే ఉంటారు. ఈ క్రమంలో తమ తప్పుల్ని తెలుసుకొని తమ జీవితాన్ని సరిదిద్దుకునే కొంతమంది ఉంటారు. అందులో ఒక్కరు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్. ప్రభాకర్ తన జీవితంలో జరిగిన తప్పుని సరిదిద్దుకోవడానికి, తన జీవితంలో వచ్చిన మరో వ్యక్తి కారణమంటూ చెప్పుకొచ్చారు.
అవును, ఈటీవీ ప్రభాకర్ తన జీవితంలో చేసిన తప్పు గురించి ఓ యూట్యూబ్ ఇంటర్య్వూలో చెప్పుకు రావడం కొసమెరుపు. ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను ప్రేమించి.. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నానని, తన వివాహం ఆర్య సమాజంలో స్నేహితుల సమక్షంలో మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. అయితే తన ఆవిడ (మలయజ) తనని ఎంతగానో నమ్మి తన జీవితంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. అలాంటి అమ్మాయిని కొన్ని విషయాలలో తాను చాలా బాధ పెట్టానని కూడా ఫీలయ్యాడు. ఒకానొక సమయంలో తాను తెలుసో.. తెలియకో ఇంకొకరితో రిలేషన్ లో ఉండడం వల్ల తన భార్య ఎంతగానో బాధ పడిందని, తనకు చెప్పుకోలేక ఎంతో బాధపడిందని పేర్కొన్నారు.