మహేష్ మూవీనే మర్చిపోయిన రష్మిక.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్..!!

murali krishna
నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో తెలిసిందే. పుష్ప -2 సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న ఆమె వరుస పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. తమిళస్టార్‌ విజయ్‌కురష్మిక పెద్ద అభిమాని అన్న సంగతి తెలిసిందే.ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను ధియేటర్‌లో చూసిన మొదటి సినిమా విజయ్‌ నటించిన 'గిల్లి' అని చెప్పారు. అంతవరకు బాగానే ఉన్నాఆ తర్వాత ఆ సినిమా గురించి వివరిస్తూ.. ఆ చిత్రం తెలుగులో మహేశ్‌ బాబు హీరోగా వచ్చిన 'పోకిరి'కి రీమేక్‌ అని.. అందులోని ఓ పాట అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. తన లైఫ్‌ మొత్తంలో ఇప్పటివర కు ఆ పాటకు ఎన్నోసార్లు స్టేజ్‌ మీద డ్యాన్స్‌ చేసినట్లు తెలిపారు. స్ర్కీన్‌ మీద చూసిన మొదటి హీరో విజయ్‌ అని ఫస్ట్‌ హీరోయిన్‌ త్రిష అని వెల్లడించారు. అయితే 'గిల్లి' సినిమా మహేశ్‌ నటించిన 'ఒక్కడు'కు రీమేక్‌గా తెరకెక్కింది. కానీ, రష్మిక 'పోకిరి' రీమేక్‌ అని చెప్పడంతో కొందరు ఆమెను సరదాగా ఆట పట్టిస్తూ ఆ ఇంటర్వ్యూ వీడియోను షేర్‌ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.

 తాజాగా అలాంటి ఓ పోస్ట్‌కు రష్మిక తెలుగులో రిప్లై పెట్టారు. 'అవును. సారీ గిల్లి సినిమా 'ఒక్కడు'కు రీమేక్‌ కదా.. అని ఇంటర్వ్యూ అయిపోయాక అనుకున్నా. పోకిరిని అదే పేరుతో తమిళంలో రీమేక్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఈ ఇంటర్వ్యూను ఇప్పుడు వైరల్‌ చేసేస్తారని కూడా అనుకున్నా. నిజంగా సారీ.. నాకు వాళ్ళు నటించిన అన్ని సినిమాలు ఇష్టమే' అంటూ ఫన్నీ ఎమోజీలను జోడించారు. రష్మిక తెలుగులో సరదాగా సారీ చెప్పడం అందరినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం రష్మిక 'పుష్ప 2' విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్లు రాబడుతోంది. రూ.1500 కోట్లకు పైగా వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే రూ.2000 కోట్ల మైలురాయిని చేరనున్నట్లు ట్రేడ్‌ వర్గాల అంచనా వేస్తున్నాయి. రష్మిక చేతిలో ప్రస్తుతం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌ ప్రాజెక్టులున్నాయి. 'కుబేరా', 'ఛావా', 'సికందర్‌', 'ది గర్లఫ్రెండ్‌' చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: