పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను శాసించిన .. తెలుగు 4 సినిమాలు ఇవే..!

Amruth kumar
పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన దగ్గరి నుంచి ప్రతి ఫిలిం మేకర్‌లు అన్ని భాషల ప్రేక్షకులను అలరించే కథలనే సినిమాగా తెరమీదకు తీసుకొచ్చేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు .. హీరోలంతా కూడా ఇతర భాషల్లో తమ మార్కెట్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు .. అయితే ఈ ట్రెండ్‌కు బాటలు వేసింది మన తెలుగు చిత్ర పరిశ్రమనే చెప్పాలి .. బాహుబలి తర్వాతే పాన్ ఇండియా సినిమాల సందడి ఎక్కువగా కనిపించింది .. కాకపోతే కేవలం భారీ హంగుల‌నే నమ్ముకోకుండా ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసే ఒరిజినల్ కంటేంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఎక్కువ సక్సెస్ అయ్యారు. అందుకే ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం మన సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పరిస్థితి వచ్చింది.ఇక 2024 లోనూ భారతీయ సినిమాపై టాలీవుడ్ డామినేషన్ గట్టిగా కనిపించింది..

మన దర్శకులు హీరోలు చేసిన సినిమాలే పాన్ ఇండియా మార్కెట్ ని శాసించాయి.  ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ సాధించిన టాప్ 10 సినిమాలు లిస్టు చూసుకుంటే .. ఇక అందులో నాలుగు తెలుగు సినిమాలే ఉన్నాయి .. ఇక వాటిలో 1000 కోట్లకు పైగా గ్రాస్ వ‌సుళ్లు రాబెట్టిన తెలుగు సినిమాలు రెండు ఉండటం మరో విశేషం .. బాలీవుడ్ టాప్ గ్రాస‌ర్‌ గా పుష్ప 2 లాంటి తెలుగు డబ్బింగ్ మూవీ చరిత్ర తీర‌గా రాసింది.. నార్త్‌లో మన ఆధిపత్యం ఎలా కొనసాగుతుందనేది పుష్ప 2 సినిమా తో స్పష్టమవుతుంది .. విలక్షణ దర్శ‌కుడు రాంగోపాల్ వర్మ మాటల్లో చెప్పాలంటే .. ఇది పాన్ ఇండియా కాదు తెలుగు ఇండియా . ఇక  అల్లుఅర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప2 సినిమా ఈ సంవత్సరం బాక్సాఫీస్ ను రూల్ చేసింది .. ఈ ఏకంగా ఈ మూవీ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. కేవలం 15 రోజుల్లోనే 1500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబెట్టిన ఈ మూవీ .. నార్త్ ముంబైలో పుష్పరాజ్ హిస్టరీ క్రియేట్ చేశాడు .. సక్సెస్ఫుల్గా థర్డ్ వీక్ లో ఎంటరైన ఈ సినిమా హిందీలో 700 కోట్ల నెట్‌ కలెక్షన్లు దిసగా దూసుకుపోతుంది.. ఫైనల్ రన్ ముగిసే సమయానికి పుష్ప2 సినిమా బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశాలు లేకపోలేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 28988AD మూవీ ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ సినిమాల్లో రెండో స్థానం దక్కించుకుంది.. నాగ్ ఆస్విన్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్  సినిమాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1200 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.. ఇక సినిమా విజయంలో పాన్ ఇండియ‌ హీరో ప్రభాస్ తో పాటుగా అమితాబచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొనే లాంటి స్టార్స్ భాగం పంచుకున్నారు .. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మొదటి భాగంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు .. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా 520 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. అలాగే స్టార్ కాస్టింగ్ లేకుండా 40 కోట్ల బడ్జెట్తో తెర్కక్కిన హనుమాన్ సినిమా 350 కోట్ల కలెక్షన్ సాధించి పాన్ ఇండియా వైడ్‌ గా సంచలనం క్రియేట్ చేసింది.

ఇక పాన్ ఇండియా మార్కెట్లో కలెక్షన్ ల వర్షం కురిపించిన తెలుగు సినిమాలతో పాటుగా బాక్సాఫీస్ దగ్గర బొక్క బార్లపడ్డ సినిమాలు కూడా ఈ ఏడాది కొన్ని ఉన్నాయి.. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ , మట్కా లాంటి రెండు పాన్ ఇండియా సినిమాలు భారీ డిజాస్టర్ గా మిగిలాయి .. భారీ ఎత్తున ప్రమోట్ చేసిన రామ్ డబుల్‌ ఇస్మార్ట్ మూవీ ఆడియన్స్ నుంచి భారీ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినా కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు .. వచ్చే సంవత్సరం కూడా టాలీవుడ్ నుంచి ఎన్నో పాన్ ఇండియ‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి .. గేమ్ చేంజర్ , తండేల్ , హరిహర వీరమల్లు , రాజా సాబ్ , మిరాయి , ఘాటి , కన్నప్ప , విశ్వంభర , హిట్ 3 , అఖండ 2 సంబరాలు ఏటిగట్టు , ఓజి ఇలా మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు 2025లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి .. వీటిలో ఏ సినిమాలు సంచలనాలు క్రియేట్ చేస్తయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: