గ్లామర్ ఫార్ములాను బ్రేక్ చేసిన రౌడీ బేబీ – సాయి పల్లవి నిర్ణయాల వెనుక పవర్‌ఫుల్ సీక్రెట్...!
నో కాంప్రమైజ్: తనకు వ్యక్తిగతంగా ఆ కథ నచ్చకపోతే, ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా, ఎంత పెద్ద స్టార్ ఉన్నా సున్నితంగా తిరస్కరించడానికి ఆమె వెనుకాడదు. ఈ ధైర్యం ఆమెను ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది.నటిగా తనకే కాకుండా, చూసే ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టకూడదు అని సాయి పల్లవి బలంగా నమ్ముతుంది. అందుకే రొటీన్ కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉండి, పది కాలాలు గుర్తుండిపోయే పాత్రలు మాత్రమే చేయాలని అనుకుంటుంది.
తిరస్కరించినవి డిజాస్టర్లే! సాయి పల్లవి తిరస్కరించిన కొన్ని భారీ ప్రాజెక్ట్‌లు (ఉదాహరణకు, ‘భోళా శంకర్’లో చిరంజీవి చెల్లెలి పాత్ర‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్ పాత్ర) బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడం.. ఆమె కథల ఎంపికలో ఎంతటి పదును ఉందో నిరూపిస్తోంది.సాయి పల్లవి తన కెరీర్ స్టార్టింగ్ నుంచి గ్లామర్ షో, రొమాన్స్ సీన్లకు, లిప్ లాక్‌లకు దూరంగా ఉంటుంది. ఈ కండీషన్స్‌కు మేకర్స్ ఒప్పుకుంటేనే సినిమా చేస్తుంది. అందుకే కోట్లు ఇచ్చినా, స్టార్ హీరో ఛాన్స్ వచ్చినా, తన ‘నటన విలువలను’ పక్కన పెట్టి ముందుకు సాగడానికి ఆమె ఇష్టపడదు.
ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న‘రామాయణ’లో సీత పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేయడానికి ఆమె సహజమైన లుక్, గ్లామర్‌కు దూరంగా ఉండే ఇమేజే కారణమని మేకర్స్ చెప్పడం.. ఆమె మాస్ నిర్ణయాలకు లభించిన మాస్ విజయంగా చెప్పవచ్చు.