టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ పాత్రలో తమన్నా రీఎంట్రీ..?

Divya
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా ఈమధ్య తెలుగులో పెద్దగా సినిమాలలో కనిపించడం లేదు. గత కొంతకాలంగా బాలీవుడ్లో సినిమాలు వెబ్ సిరీస్లలో స్పెషల్ సాంగ్ లలో కనిపిస్తూ బిజీగా ఉన్న తమన్నా ఇప్పుడు తెలుగులోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు వినిపిస్తున్నాయి. మాస్ హీరో రవితేజ నటిస్తున్న ఇరుముడి చిత్రంతో గ్రాండ్ కం బ్యాక్ ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.


ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ అయ్యప్ప స్వామి మాల ఇరుముడి చుట్టూ తిరిగేటువంటి స్టోరీ కావడంతో ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామా సినిమాగా ఉండబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో తమన్నా ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతుండడం గమనార్హం. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియా భవాని శంకర్ నటిస్తూ ఉండగా తమన్నా ఈ సినిమాలోని పాత్ర కథను మలుపు తిప్పే లా ఉంటుందని వినిపిస్తున్నాయి. కథపరంగా చాలా ప్రాధాన్యత ఉండడంతో తమన్నా ఈ ఆఫర్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.


గతంలో రవితేజ, తమన్నా కాంబినేషన్లో బెంగాల్ టైగర్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో భక్తి బాగోద్వేగాల కలయికల రాబోతూ ఉండడం గమనార్హం. డైరెక్టర్ శివ నిర్వాణ తన మార్క్ ఎమోషన్స్ తో పాటుగా అయ్యప్ప మాల గురించి చాలా అద్భుతంగా ఆవిష్కరించబోతున్నారు. రవితేజ అంటే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు. కానీ మొదటిసారి ఇలాంటి డివోషనల్ టచ్ ఉన్న కథను ఎంచుకోవడంతో అటు అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. మరి తమన్నా కెరీర్ కు ఇరుముడి సినిమా మరొకసారి మంచి బూస్ట్ ఇస్తుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ అయితే వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: