విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా..గీత గోవిందం,డియర్ కామ్రేడ్ సినిమాల సమయంలో ప్రేమలో పడి ఇన్ని రోజులు తమ రిలేషన్ ని గుట్టుగా సాగించారు. అయితే రిలేషన్ ఎంత గుట్టుగా పెట్టిన్న సరే అభిమానులు మాత్రం పసిగట్టేశారు. వీరిద్దరూ తమ రిలేషన్ ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ప్రతిసారి ఏదో ఒక విషయంలో అడ్డంగా బుక్ అవుతూ ఉండేవారు. అలా ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒక్కటై అధికారికంగా భార్యాభర్తలుగా మారిపోయారు. ఇక వీరి పెళ్లి గురించి చాలామంది మాట్లాడుకున్నారు. సినీ సెలబ్రిటీలు ఎవరు వీళ్ల లాగా పెళ్లి చేసుకోలేదు. అంతలా వీరి పెళ్లి వైరల్ అయింది. ఇక పెళ్లి తర్వాత కూడా అభిమానులకి లంచ్ పెట్టడం, గుళ్ళల్లో అన్నదానాలు నిర్వహించడం, దేశవ్యాప్తంగా అభిమానులకు స్వీట్స్ పంచడం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదంతా పక్కన పెడితే రష్మిక మందన్నా మొదట రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.కిర్రిక్ పార్టీ సినిమాలో రష్మిక మందన్నా రక్షిత్ శెట్టి ఇద్దరు కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డ ఈ జంట తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక వీరికి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయ్యాయి. కానీ ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకే రష్మిక రక్షిత్ శెట్టిలు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక బ్రేకప్ అయ్యాక రష్మిక మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అయింది. అలా ఛలో,గీతగోవిందం వంటి సినిమాలతో రష్మిక రేంజ్ మారిపోయి ఒక్కసారిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.
అయితే రష్మిక విజయ్ దేవరకొండలు పెళ్లి చేసుకోవడంతో కొంతమంది కన్నడ ఫాన్స్ రక్షిత్ శెట్టి ని ఇందులోకి లాగుతూ రష్మిక మందన్నాని ట్రోల్ చేశారు. అయితే దీనికి సంబంధించి తాజాగా రష్మిక మందన్నా తల్లి మాట్లాడిన ఒక ఆడియో క్లిప్ వైరల్ అవుతుంది. ఆ ఆడియో క్లిప్ లో రష్మిక మందన్నా తల్లి సుమన్ మందన్నా..ఒకవేళ నా కూతురు రష్మిక రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకుంటే వారికి బానిస అయ్యేది.నా కూతురికి ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది అంటూ మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఎన్ని రోజులు రష్మికను తప్పుగా అర్థం చేసుకున్నాం. రష్మిక నిజంగానే ఆ రిలేషన్ లో ఇబ్బంది పడింది కావచ్చు. లేకపోతే ఎందుకు ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకుంటుంది. రష్మిక తల్లి చెప్పింది నిజమే కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.