అఖండ 2 : కేరిర్ బెస్ట్ అని ఆనందపడ్డారు.. ఒక్క వార్తతో బాలయ్య అభిమానుల్లో నిరుత్సాహం..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని ఇప్పటికి కూడా తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం అఖండ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా కంటే ముందు బాలయ్య నటించిన పలు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక అఖండ మూవీ దగ్గర నుండి ఈయన నటించిన వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి , డాకు మహారాజ్ మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా బాలయ్య "అఖండ" మూవీ కి కొనసాగింపుగా రూపొందిన అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటించాడు.


ఈ మూవీ ఈ రోజు అనగా డిసెంబర్ 5 వ తేదీన విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇకపోతే ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 114.25 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ గతంలో బాలకృష్ణ నటించిన ఏ సినిమాకు కూడా జరగలేదు. ఇలా బాలకృష్ణ కెరియర్లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు జరగడం , ఈ మూవీ పై భారీ అంచనాలు ఉండడంతో బాలయ్య అభిమానులు ఈ సినిమా విషయంలో చాలా ఆనందపడ్డారు. ఇలా ఈ సినిమా గురించి బాలయ్య అభిమానులు ఎంతో ఆనంద పడి , ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సమయంలో ఈ మూవీ విడుదల వాయిదా పడడంతో వారు తీవ్ర నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతానికి ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై కూడా క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: