పాపం పాన్ ఇండియా హీరో ప్రభాస్ .. గత 12 ఏళ్లుగా పాతపాటే.. !

Amruth kumar
అదేంట్రా బాబు .. పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమా ఒక్కటి కూడా ఆయన చెప్పిన టైం కు రాదా.. ? గత 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఏ సినిమాను అనౌన్స్ చేసిన డేట్ కి విడుదల చేయట్లేదు ? తప్పు హీరో చేస్తున్నాడా .. లేదంటే చిత్ర యూనిట్ ప్లానింగ్ లో తప్పు ఉందా ? బయటికి చెప్పట్లేదు కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్ ఇదే .. ఇక మరి దీనికి కారణమేంటి ..? మళ్లీ ఇప్పుడు కొత్తగా ఏమైంది ? ప్రభాస్ సినిమా అంటే ఈక్వల్ టు పోస్ట్ పోన్ అనే కొత్త లెక్కలు చెబుతున్నారు దర్శక నిర్మాతలు .. ఏంటి అంత మాట అనేస్తున్నారు అనవచ్చు కానీ జరుగుతున్నది మాత్రం ఇదే ..

 అప్పుడెప్పుడో మిర్చి నుంచి మొదలైన ఈ వాయిదాల పరంపర రారాజా సాబ్ వరకు కంటిన్యూ అయ్యేలానే కనిపిస్తుంది . వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10 న రాజా సాబ్ రిలీజ్ పై అనుమానాలు కనిపిస్తున్నాయి .. ఎవరేమనుకున్నా ఆ తేదీకే రాజా సాబ్ వస్తాడని మేకర్స్‌ చెబుతున్న .. చిత్ర పరిశ్రమలో ప్రచారం మాత్రం మరోలా కనిపిస్తుంది . ఇక నిజానికి ఎప్పుడో రావాల్సిన రాజా సాబ్ ను వేరే సినిమాల కోసం ఆపుతూ వచ్చింది పీపుల్ మీడియా సంస్థ.. తాజాగా ప్రభాస్ కాలికి గాయం కావడంతో సమ్మర్ కు రావటం కష్టమని తెలుస్తుంది ..

 ఇలా ప్రభాస్ ప్రతి సినిమాకు పోస్ట్ పోన్ అనేది కామన్ గా మారిపోయింది..  మిర్చి సినిమా నుంచి మొదలైన ఈ వాయిదాల పరంపర .. ఆ తర్వాత బాహుబలి సిరీస్ రెండు మూడుసార్లు డేట్స్ మార్చాడు .. రాజమౌళి కాద అని సర్దుకున్నారు అభిమానులు .. తర్వాత సాహూకు అలాగే జరిగింది .. రాధే శ్యామ్ , ఆదిపురుష్ విషయం లోనూ మూడుసార్లు వాయిదాలు పడ్డాయి . కల్కి 2024 సంక్రాంతి కానీ చెప్పి మే 9 కి వాయిదా వేసి చివరికి జూన్ 27 న రిలీజ్ చేశారు .. ఇప్పుడు ఈ లెక్కన చూస్తే రాజా సాబ్ ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికి తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: