HBD: తమన్నా ఫస్ట్ రెమ్యూనరేషన్ తో అలాంటి పని చేసిందా..?
తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా వెబ్ సిరీస్, స్పెషల్ సాంగ్ లలో కనిపించడమే కాకుండా ఇతర భాషలలో కూడా నటిస్తూ భారీ క్రేజ్ అందుకుంది. తమన్నా పదవ తరగతి చదువుకునే రోజులలోనే సినిమాల్లోకి వచ్చేసిందట. శ్రీ సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఇమే అప్పట్లోనే మంచు మనోజ్తో కలిసి నటించింది. అప్పటికే తమన్నా వయసు 15 సంవత్సరాలు. అయితే దీనికంటే ముందుగా ఒక చిన్న కమర్షియల్ యాడ్ లో కూడా నటించిందట తమన్నా.
తమన్నా పదవ తరగతి చదువుతున్న సమయంలో పదవ తరగతి ఎగ్జామ్స్ రాసి మధ్యాహ్నం సమయాలలో 3గంటలు కమర్షియల్ యాడ్ లలో నటిస్తూ ఉండేదట. అలా 2005లో జరిగిన ఒక యాడ్ కోసం మూడు రోజులపాటు తన సమయాన్ని కేటాయించడంతో వారు అప్పట్లోనే లక్ష రూపాయల వరకు పారితోషకం ఇచ్చినట్లుగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. పదవ తరగతి ఎగ్జామ్స్ అయిపోగానే తన మొదటి సంపాదనను కుటుంబంతో కలిసి షాపింగ్ చేసిన తర్వాత హోటల్ కి వెళ్లి కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేస్తూ తమకు ఇష్టమైన ఆహారాన్ని తిన్నామని తెలిపింది తమన్నా. ఆ హ్యాపీ మూమెంట్ ని ఇప్పటికి మరిచిపోలేను అంటూ తెలియజేసింది. కానీ 2007లో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో తమన్నా కెరీరే మారిపోయింది.. తర్వాత తమన్నా కెరియర్ లోనే స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా అతి తక్కువ సమయంలోనే పేరు సంపాదించింది. ప్రస్తుతం తమన్నా చేతిలో ఓదెల-2 చిత్రంలో విభిన్నమైన పాత్రలో నటిస్తోంది.