గ్లోబల్ స్టార్
రామ్ చరణ్ హీరో గా నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం వచ్చే నెల 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు, హిందీ,
తమిళ భాషల్లో విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యం మేకర్స్ ఈ
సినిమా ప్రొమోషన్స్ ని భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు డల్లాస్ లో ప్రీ రిలీజ్
ఈవెంట్ కోసం
మూవీ టీం మొత్తం బయలుదేరింది.
రామ్ చరణ్ కి డల్లాస్ విమానాశ్రయంలో భారీ ఎత్తున స్వాగతం పలికారు మెగా అభిమానులు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్
మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
రామ్ చరణ్ అమెరికా గడ్డ మీద ఏమి మాట్లాడబోతున్నాడో అని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే
రామ్ చరణ్ అభిమానులు ఎవ్వరికీ సాధ్యం కానీ అరుదైన రికార్డు ని తమ అభిమాన
హీరో కోసం క్రియేట్ చేసారు.ఇది ఇలా ఉండగా ఈ నెల 27 వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్
ఈవెంట్ ని
హైదరాబాద్ లోని
యూసఫ్ గూడ పెరేడ్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు మేకర్స్. ఈ
ఈవెంట్ కి
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. అదే విధంగా
జనవరి 4 వ తేదీన
ఆంధ్ర ప్రదేశ్ రాజముండ్రి లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్
ఈవెంట్ ని నిర్వహించనున్నారు. ఈ
ఈవెంట్ కి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప
ముఖ్యమంత్రి పవన్
కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో రెండు రోజుల్లో రాబోతుంది. అదే జరిగితే గనుక
గేమ్ ఛేంజర్ హైప్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్తుంది. అలాగే ఈ
సినిమా ట్రైలర్ ను ఈ నెల 27 న
ఈవెంట్ నా లేక .ఆన్ లైన్ లో రిలీజ్ చేయాలా అన్నదానిపై డిస్కషన్ జరుగుతోందట.‘రంగస్థలం’ చిత్రం తర్వాత పవన్
కళ్యాణ్ తన అబ్బాయ్
రామ్ చరణ్ సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రాబోతుండడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ
ఈవెంట్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి మంచి బూస్ట్ ఇస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.