పవన్ కళ్యాణ్ ఒక్కడికే ఆ మంత్రం పనిచేస్తుందా.. దెబ్బకు థింకింగ్ మారిపోయిందిగా..!

Amruth kumar
చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది ..! ఇది ఎంతో ఫేమస్ డైలాగ్ .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఈ డైలాగ్ బాగా సూట్ అవుతుంది.. అసలే ఇప్పుడు ఆయన ఉపముఖ్యమంత్రి.. పైగా అదేదో చట్టంతో పని అంటున్నారు ఏంటి అంటూ కంగారు పడకండి .. అసలు విషయం ఏంటో ఇంకాస్త క్లారిటీగా ఇక్కడ తెలుసుకుందాం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే అంత ఈజీ కాదు అని దర్శక నిర్మాతలకు బాగా తెలుసు. అన్నీ తెలిసే ఆయనతో రంగంలోకి దిగారు .. అందుకే మేకర్స్ కూడా పవన్ దారిలోనే వెళ్తున్నారు ఇప్పుడు .. ఆయన ఉన్న లేకపోయినా షూట్ కు వచ్చిన రాకపోయినా షూటింగ్స్ మాత్రం ఎక్కడ ఆగట్లేదు .. ఇండియాలో వీరముల్లు.. ఇతర దేశాల్లో ఓజి షూట్ జరుగుతూనే ఉంది.

హరిహర వీరమల్లు  కోసం రీసెంట్గా డేట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ .. ఆయన ఇచ్చిన కొన్ని కాల్షీట్స్‌నే బంగారంలా వాటేసుకున్నారు చిత్ర యూనిట్.
మరోవైపు   ఓజి దర్శకుడు సుజిత్ అయితే ఎవరు ఊహించని లేవల్ .. పవన్ కళ్యాణ్ లేకుండానే ఓజి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టేసారు .. అంతేకాకుండా తాజాగా డీజే టిల్లు ఫేమ్ నేహశెట్టి తో థాయిలాండ్ లో ఓ స్పెషల్ సాంగ్ కూడా షూట్ చేస్తున్నారు .. ఈ నెల చివర్లోని ఓజీ సెట్ లో పవన్ జాయిన్ కానున్నారు.

ఈలోపు ఆయన లేని సీన్స్ షూటింగ్ చక చకా జరుగుతుంది .. బ్యాంకాక్ , థాయిలాండ్ షెడ్యూల్స్ అయిపోతే ఓజి షూటింగ్ దాదాపు 90% కంప్లీట్ అయినట్టే .. అందుకే చెబుతుంది చట్టం తన పని తాను చేసుకుపోతుందని .. పవన్ కళ్యాణ్ లేకున్నా షూటింగ్స్ ఆగట్లేదు .. అన్ని అనుకున్నట్లు కుదిరితే 2025 లో జనసేనాని నుంచి డబల్ ట్రీట్ ఖాయమని కూడా చెప్పవచ్చు .. ఇప్పటికే 2025 మార్చ్ 25న హరిహర వీరమల్లు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది .. అలాగే ఓజీ కూడా 2025 అక్టోబర్ లేదా డిసింబ‌ర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా 2025 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులకు డబల్ ట్రీట్ ఇవ్వడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: