తెలంగాణ కాంగ్రెస్ లీడర్ లలో అద్భుతమైన గుర్తింపు కలిగిన వారిలో భట్టి విక్రమార్క ఒకరు . ఈయన కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2007 వ సంవత్సరం నుండి 2009 వ సంవత్సరం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా పని చేశాడు . బట్టి 2009 లో మధిర నియోజక వర్గం నుండి తొలిసారి శాసన సభ్యుడిగా గెలిచాడు. డిప్యూటీ స్పీకర్ గా కూడా పని చేశాడు. 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందాడు. ఇకపోతే 2023 వ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో బట్టి విక్రమార్క ఎమ్మెల్యే గా గెలుపొందాడు.
అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాలను సాధించడంతో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యాడు. ఇక రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి కావడంతో బట్టి విక్రమార్క కు అద్భుతమైన మంత్రి పదవులు దక్కాయి. ప్రస్తుతం బట్టి విక్రమార్క నుండి రేవంత్ రెడ్డి మంత్రివర్గం లో ఉప ముఖ్య మంత్రి గా , ఆర్థిక శాఖ మంత్రి గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే బట్టి తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకుంటూ రాజకీయ కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం లో కీలక మంత్రి పదవుల్లో కొనసాగుతూ దాదాపు సంవత్సరం కాలం ముగిసిన కూడా బట్టి పై ఎలాంటి విమర్శలు కూడా రాకపోవడం గొప్ప విషయం అని చెప్పవచ్చు దానితోనే అర్థం అవుతుంది. ఈయన మంత్రి పదవులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడు అని. ఇకపోతే బట్టి కాంగ్రెస్ పార్టీ.లో కూడా అద్భుతమైన నేతగా కొనసాగుతున్నాడు.