డాకు మహారాజులోనూ.. బాలయ్య ఆ సెంటిమెంటు రిపీట్ చేస్తున్నాడుగా?
అవును, ఎన్ని మాస్ ఎలిమెంట్స్ ఉన్నా.. ఆ ఎమోషన్ అయితే ఈమధ్య పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారు బాలయ్య. ఎందుకంటే... ఈ ఫార్ములా సక్సెస్ లో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. విషయం ఏమిటంటే... రీసెంట్ టైమ్స్ లో బాలయ్య సినిమాలో చైల్డ్ సెంటిమెంట్ ఉండడం మనం గమనించవచ్చు. అఖండ సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో ఓ చిన్నారి కనిపించారు. పాప ప్రాణం కాపాడటం కోసమే జనం జీవనం లోకి వచ్చే అఘోరాగా కనిపించారు బాలయ్య. ఇప్పుడు పార్ట్ 2 విషయంలో ఆ పాపకు ఇచ్చే మాటనే లీడ్ గా తీసుకుంటున్నారని గుసగుసలు వినబడుతున్నాయి.
అవును, రాబోతున్న సంక్రాంతికి రిలీజ్ కు రెడీ అవుతున్న డాకు మహారాజ్ సినిమాలో ఇదే సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తున్నారట నందమూరి హీరో. ఈ సినిమా లోనూ చైల్డ్ సెంటిమెంట్ కు పెద్ద పీట వేసినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో గత చిత్రాల సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసిన చైల్డ్ సెంటిమెంట్ డాకు మహారాజ్ విషయంలోనూ రిపీట్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక ఇటీవల బాలయ్య చేసిన భగవత్ కేసరి సినిమా గురించి తెలిసిందే. తనకు ఏ మాత్రం సంబంధం లేని ఓ చిన్నారి కోసం భగవంత కేసరి ఏం చేశాడన్నదే సినిమా కథగా తెరకెక్కిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమాలో ఎక్కువ భాగం బాలయ్య – శ్రీలీల పాత్రలే కనిపించినా.. ఒక్క పాట, కొన్ని సీన్స్‌లో చిన్న పాపతో కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టి పడేశారు నందమూరి హీరో.