శ్రీలీల పెళ్లి బాధ్యత నాదే.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్?
ఈ షోలో బాలకృష్ణ మాట్లాడుతూ... భగవంత్ కేసరి సినిమాలో తన కూతురి పాత్రలో శ్రీలీలతో మంచి సన్నహిత సంబంధం ఏర్పడిందని, శ్రీలీల తన సొంత కూతురిలాంటిదని పేర్కొన్నాడు. ఈ క్రమంలో శ్రీలీలకి మంచి వరుడిని చూసి పెళ్లి చేస్తానని చెబుతూ, ఆ పెళ్లి బాధ్యతని తానె దగ్గరుండి చూసుకుంటూ పెళ్లి చేస్తానని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం టాలీవుడ్లో గరంగరంగా మారింది. దాంతో నందమూరి ఫాన్స్ మా బాలయ్య తోపు అనే నినాదాలు చేస్తున్నారు. ఇలా ఉండగా బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తుండగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సంగతి విదితమే. ఇక డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది.
శ్రీలీల విషయానికి వస్తే, ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాలో ఈ అమ్మడు "కిస్సిక్" స్పెషల్ సాంగ్ లో నర్తించి మెప్పించింది. దాంతో ఈ పాట బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ అనే సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా ఇరగదీయడానికి సిద్ధం అయింది. ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతుండగా ఇందులో ఆమె ఒక పోలీస్ పాత్రను వేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.