ప్రశాంత్ వర్మకు బాలయ్య షాక్ .. మోక్షజ్ఞ లిస్టులోకి మరో ఇద్దరు..!?
తన ఫస్ట్ లుక్ తోనే అందర్నీ మెప్పించాడు ..స్టైలిస్ట్ గా ఉన్న మోక్షజ్ఞ ని చూసి నందమూరి అభిమానులు ఎంతగానో సంతోషించారు. ఈ సినిమా హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో తెరకెక్కించబోతున్నారు. అనుకున్న టైంలో ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి . అలాగే భారీ మొత్తంలో రెమ్యూనిరేషన్ కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది .. అలాగే ముందు సినిమా కథ చెప్పినపుడు ఒక విధంగా ఇప్పుడు ఒక విధంగా మాట మార్చడంతో బాలయ్యకు పట్టరాని కోపం వచ్చిందట .. మొదట్లో బాలయ్య యంగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ ఎంతో యాక్టివ్గా ఉంటాడన్న ఉద్దేశంతో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు ..
కానీ ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాడంటూ వార్తలు వినిపించడంతో బాలయ్య అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు .. ఈ సినిమాలో మోక్షజ్ఞతో పాటు బాలయ్య కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నాడు .. మహభారతననికి సంబంధించిన కథతో మోక్షజ్ఞ తొలి మూవీ ఉంటుందని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి.. ఇదే క్రమంలో బాలకృష్ణ , మోక్షజ్ఞ తొలి మూవీని ఆదిత్య999 కథను తన సొంత డైరెక్షన్లో కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయాలని బాలయ్య అనుకున్నాడు .. ఇప్పటికే బాలయ్య ఈ కథను రెడీ చేశాడు ..ప్రస్తుతం తన సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉండటంతో ఈ సినిమాకు కాస్త గ్యాప్ రావచ్చునే చెప్పాలి .. ఇదే క్రమంలో మోక్షజ్ఞ తొలి మూవీ దర్శకులుగా నాగ్ అస్విన్ , వెంకీ అట్లూరి పేర్లు కూడా టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి .. ప్రశాంత్ వర్మ మూవీ క్యాన్సిల్ అయితే మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి.