పవన్ సినిమాకు కొకొరియోగ్రాఫర్ గా పుష్పరాజ్ .. ఏ పాట కంటే ..?
ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన షూటింగ్ను కంప్లీట్ చేస్తున్నాడు.. ఈ సినిమా తర్వాత ఓజి సినిమా షూటింగ్ కూడా పవన్ మొదలు పెట్టబోతున్నాడు. పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో గుడుంబా శంకర్ సినిమా కూడా ఒకటి .. మీరాజాస్మిన్ ఈ సినిమాలో పవన్ కు జంటగా నటించారు .. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది .. చిలకమ్మా ముక్కుకి అనే పాట ఈ సినిమాలో ఎంతో హైలెట్ అవుతుంది .. అయితే ఈ సినిమాలో ఈ పాటకి డాన్స్ కొరియోగ్రఫీ చేసింది అల్లు అర్జున్ అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ..
ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఈ పాటకి అల్లు అర్జున్ అయితే ఎలా డాన్స్ చేస్తారు అని అడగగా అల్లు అర్జున్ ఈ పాటకి డాన్స్ చేసి చూపించారట .. ఇక పవన్ కళ్యాణ్ కూడా అలానే ఈ సినిమాలో చేశారని తెలుస్తుంది .. ఎంతో సింపుల్ గా ఈ సినిమాలో పాటకి కొరియోగ్రఫీ చేశారట .. ఇలా కొరియోగ్రాఫర్ గా బన్నీ పవన్ కళ్యాణ్ సినిమాకు అనుకోకుండా మారిపోయారు .. ఏదో కొంచెం డాన్స్ వేసి చూపిస్తే ఆయన్ను ఈ సినిమాకి కొరియోగ్రఫీగా చేసేసారు అంటూ అప్పట్లో అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ తో అన్నట్లు తెలుస్తుంది.