నేను దేవున్ని కాదు.. నన్ను అలా పిలవకండి.. స్టార్ హీరో రిక్వెస్ట్?
ఈ మేరకు అజిత్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. “ఈమధ్య కాలంలో ముఖ్యమైన కార్యక్రమాల్లో, ఈవెంట్లలో నేను కనిపించినప్పుడు అనవసరంగా నన్ను కడవులే అజిత్ (దేవుడు అజిత్) అంటూ పలువురు స్లోగన్స్ చేస్తున్నారు. దయచేసి అలా పిలవద్దు... ఆ పిలుపులు నన్ను ఎంతగానో బాధిస్తున్నాయి. నిజంగా ఆ స్థాయి నాకు ఉందో లేదో తెలియదు. మీ అభిమానం నాకు అర్ధం అవుతోంది. కానీ నా పేరుకు ఇతర బిరుదులను తగిలించడం నాకు నచ్చడం లేదు. నన్ను నా పేరుతో పిలిస్తే చాలు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా హార్ట్ వర్క్ చేసి జీవితంలో ముందుకు సాగండి. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమించండి” అంటూ అజిత్ పేర్కొన్నాడు.
ఆ విన్నపం చూసిన అభిమానులు అజిత్ ని ఆకాశానికెత్తేస్తున్నారు. అందుకే మీరంటే మాకు చచ్చినంత ఇష్టం! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే అజిత్ ఎక్కువగా సినీ ఈవెంట్లలో కనిపించడు. సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉంటాడు. ఈ హీరోకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన మేనేజర్ సురేష్ చంద్ర తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటాడు. ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న అజిత్ మిజిల్ తిరుమేణి దర్శకత్వంలో విడతిల అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా ఈ సినిమాపైన అభిమానులకు చాలా అంచనాలు ఉన్నాయి.