రానాతో హిట్టు కొట్టిన డైరెక్టర్ తో గోపీచంద్.. ఈసారి మరింత కొత్తగా?
అవును, హీరో గోపీచంద్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి చెప్పిన ఓ కథకు ఓకే చెప్పాడని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. గతంలో ఘాజీ, అంతరిక్షం వంటి ఔట్ ఆఫ్ ది బాక్స్ చిత్రాలను తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి, ఈసారి అందుకు భిన్నంగా ఓ కథను రెడీ చేసుకొని కథను గోపీచంద్‌కు వినిపించగా, అది ఆయనకు పిచ్చిపిచ్చిగా నచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే నిజంగానే ఆ కథ మ్యాచో స్టార్‌కి నచ్చిందా.. అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ విషయమై చిత్ర యూనిట్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు కాబట్టి!
అయితే ఈ విషయం సోషల్ మీడియా వేదికగా తెలుసుకున్న గోపీచంద్ అభిమానులు మాత్రం ఈ విషయం నిజం కావాలని, ఈ మూవీతో ఎలాగైనా తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ దర్శకుడు సంకల్ప్ రెడ్డి ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే. ఆయన చాలా ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ ఉంటారు. సంకల్ప్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 1984, అక్టోబరు 20న జన్మించాడు. 2006లో హైదరాబాదులోని సి.వి.ఆర్. కళాశాలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత ఆస్ట్రేలియా, బ్రిస్బేన్ లోని గ్రిఫ్ఫిత్ విశ్వవిద్యాలయంలో ఎంబిఏ మధ్యలోనే వదిలేసి, ఆస్ట్రేలియాలోనే ప్రసిద్ధిపొందిన గ్రిఫిత్ ఫిల్మ్ స్కూల్లో చిత్ర దర్శకత్వంలో MFA ను (2009) చదివాడు. అది పూర్తయిన తరువాత సంకల్ప్ రెడ్డి టాలీవుడ్ వచ్చి ఘాజీ, అంతరిక్షం వంటి సూపర్ డూపర్ చిత్రాలను నిర్మించడం జరిగింది.