నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల హనీమూన్.. హీట్ పెంచేస్తున్న సమంత పోస్ట్..!?
అయితే వీళ్ళు మాత్రం మా మధ్య ప్రేమ ఉంది అన్న విషయాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు. ఫైనల్లీ నిశ్చితార్ధం చేసుకున్నాకనే ఆ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టారు. తాజాగా డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జున కొడుకు నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు . దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే పెళ్లికి ముందే రానా నిర్వహిస్తున్న టాక్ షోకి గెస్ట్ గా వెళ్ళాడు నాగచైతన్య .
ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .."నాకు ఇద్దరు పిల్లలు కావాలి అని.. వాళ్లతో లైఫ్ హ్యాపీగా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను" అంటూ చెప్పుకు వచ్చారు. దీంతో అందరూ సమంతనే తప్పు అంటూ మాట్లాడారు. సమంతకి పిల్లలు అంటే ఇష్టం లేదు అని ..ఆ కారణంగానే నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసింది అని నోటికి వచ్చిన వాగుడు వాగారు . ఫైనల్లీ శోభిత తో పెళ్లి అయిపోయింది .. మరి కొద్ది రోజుల్లోనే వాళ్ళు మాల్దీవ్స్ కి హనీమూన్ కి వెళ్ళబోతున్నారు . ఇదే మూమెంట్లో సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. 2025 తనకి ఎలా కలిసి రావాలి అనుకుంటుంది ..? ఎలా ఉండాలి అనుకుంటుంది..? అనే విషయాన్ని చెప్పిన సమంత .. తనకి అర్థం చేసుకునే భాగస్వామి రావాలి అని ..తనకు పిల్లలు కావాలి అని.. ఓపెన్ గా చెప్పుకొచ్చింది. దీనితో సోషల్ మీడియాలో సమంత కూడా త్వరలోనే రెండో పెళ్లి గుడ్ న్యూస్ చెప్పబోయే లానే ఉంది అంటున్నారు జనాలు..!