ప్రభాస్ ను భయపెడుతున్న మెగా ఫ్యామిలీ ?

frame ప్రభాస్ ను భయపెడుతున్న మెగా ఫ్యామిలీ ?

Veldandi Saikiran
ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదగడం చూసాం. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో "ది రాజా సాబ్" సినిమా ఒకటి. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు కేవలం చిన్న సినిమాలకి మాత్రమే దర్శకత్వం వహించిన మారుతి ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాడు.

ఈ సినిమా ప్రారంభంలోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇందులో ప్రభాస్ గతంలో ఎప్పుడూ చేయని విధంగా హార్రర్ కామెడీ జోనర్ లో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2025 ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.... మెగా హీరో చిరంజీవి "విశ్వంభర" సినిమాతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

కానీ తన కుమారుడు రామ్ చరణ్ నటించిన "గేమ్ చేంజర్" సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీంతో చిరంజీవి సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నారు. అయితే "విశ్వంభరా" సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే విషయాన్ని మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుందని ఓ వార్త వైరల్ అవుతుంది. అదే సమయానికి ప్రభాస్ నటించిన "ది రాజా సాబ్" సినిమా వస్తున్నట్లు ఇప్పటికే ఈ విషయాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

 కానీ "విశ్వంభర" సినిమాను ప్రభాస్ అనుబంధ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తుండడంతో మెగాస్టార్ కు పోటీగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో బరిలోకి దిగడని టాక్ వినిపిస్తోంది. ఈ కారణం వల్ల రాజా సాబ్ ఏప్రిల్ 10వ తేదీన విడుదల కాకపోవచ్చని టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఏప్రిల్ 10వ తేదీన ఏ సినిమా విడుదల అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: