ఓర్నీ షెకావత్తూ అది రియల్ గుండు కాదా? వీడియో వైరల్!

frame ఓర్నీ షెకావత్తూ అది రియల్ గుండు కాదా? వీడియో వైరల్!

MADDIBOINA AJAY KUMAR
స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన పుష్ప 2 సినిమా హిట్ సాధించింది. టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు యావత్ భారతదేశ ప్రేక్షకులు ఈ సినిమాను కొనియాడారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. అయితే ఇప్పటికే పార్ట్ వన్ హిట్ కొట్టడంతో ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమాను తీశారు. ఇకపోతే పుష్ప 2  మూవీ యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇచ్చిందని టాక్ కూడా వినిపించింది. అలాగే స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అన్నీ నెక్స్ట్ లెవల్లో ఉండడంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.


ఇక అల్లు అర్జున్ గంగ రేణుక తల్లి పాటలో వేసిన అమ్మవారి గెటప్ కి మాత్రం ఫాన్స్ పెరిగిపోయారు. ఆ పాటలో ఆయన యాక్టింగ్ కి ప్రశంసల వర్షం కురిసిందనే చెప్పాలి. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటించింది. ఆమె కూడా భార్య పాత్రకు నిలువెత్తు రూపంగా నిలిచిందని అంటున్నారు. ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రలలో నటించారు.

 
ఈ సినిమాతో ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ లో నటించి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. ఫహాద్ పుష్ప 1 అండ్ పుష్ప 2 సినిమాలలో విలన్ పాత్రలో అదరగొట్టాడు. ఈ సినిమాతో మంచి హిట్ అందుకుని ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఫహాద్ ఈ సినిమాలో ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఫహాద్ ఈ సినిమాలో గుండుతో కనిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఫహద్ రియల్ గుండు చేయించుకున్నారని అందరూ అనుకున్నారు. కానీ అది నిజమైన గుండు కాదు అంట. ఈ విషయం తాజాగా పుష్ప సినిమా షూటింగ్ లో బ్రహ్మాజీ తీసిన ఓ వీడియో ద్వారా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ ఏంటి షెకావత్ ఇంత మోసం చేశావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: