ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది అమాయకులు నష్టపోతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కూడా చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ని ఎక్కువగా సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది నష్టపోతూ.. సమస్యలు ఎదురుకుంటున్నారు. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్స్ చేసిన మంచు లక్ష్మీ, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, రానా దగ్గుబాటి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నగాళ్ల, యాంకర్ విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, యూట్యూబర్ టేస్టీ తేజ, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రీతూ చౌదరి, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్, సందీప్ లపైన కేసులు నమోదు చేశారు.
ఈ బెట్టింగ్ యాప్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. రోజులు గడుస్తున్నా కొద్ది ఒక్కొక్కరిగా అందరి పేర్లు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలపైన కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా.. ఇటీవల నెల్లూరుకి చెందిన శ్రీరాంబాబు అనే వ్యక్తి టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణపై ఆరోపణలు చేశాడు. బాలకృష్ణ fun88 అనే బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేశారని అన్నాడు. అలా చేయడం వల్లనే బాలకృష్ణపైన ఉన్న నమ్మకంతో శ్రీరాంబాబు ఆ యాప్ లో బెట్టింగ్ కాసి రూ. 80 లక్షలు నష్టపోయానని చెప్పాడు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ గా వ్యవహరించారు.
ఆ షోలో ప్రభాస్, గోపీచంద్ గెస్టులుగా హాజరయ్యారని.. వాళ్లు హాజరయ్యిన ఎపిసోడ్ లో బాలయ్య బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారని తెలిపారు. అయితే ఈ విషయంపై కేసు నమోదు చేసేందుకు శ్రీరాంబాబు పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్తే.. బెట్టింగ్ ఆడడం కూడా నేరం అని అన్నారంట. ఇప్పుడు నువ్వు కేసు నమోదు చేస్తే నిపైన కూడా కేసు పెట్టాల్సి వస్తుందని అతనిని బెదిరించారని శ్రీరాంబాబు చెప్పుకొచ్చాడు.