గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు..గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గా నిలవడంతో రాంచరణ్ తన తరువాత సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు.. ప్రస్తుతం రాంచరణ్ “RC16” షూటింగ్ లో బాగా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్నాడు..బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామా సినిమాగా ఈ మూవీ తెర కెక్కుతుంది.గత నెల ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైనఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు..ఈ సినిమాలో రాంచరణ్ “ఆట కూలీగా” కనిపించనున్నట్లు సమాచారం..
ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..ఈ సినిమా తరువాత రాంచరణ్ దర్శకుడు సుకుమార్ తో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు... RC 16 సినిమా తో చరణ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు..అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.. ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో దెబ్బతిన్న రామ్ చరణ్ అదే సంక్రాంతికి మాస్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం..
ఇదిలా ఉంటేమార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భం గా ఈ మూవీ టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.రాంచరణ్ సినిమా అంటే ఫ్యాన్స్ లో ఓ రేంజ్ ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి.. చరణ్ కి రంగస్థలం రేంజ్ హిట్ పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.. పాత్ర ఎలాంటిది అయినా చరణ్ తన యాక్టింగ్ తో ఆకట్టుకుంటాడు.. దీనితో మేకర్స్ సైతం చరణ్ కోసం ఛాలెంజింగ్ పాత్ర సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది..