టాలీవుడ్ నటి రజిత ఇంట విషాదం..!

frame టాలీవుడ్ నటి రజిత ఇంట విషాదం..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నటి రజిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలు నటించిన నటి  ఇంట తాజాగా విషాద ఛాయలు నెలకొన్నాయట. ఈమె తల్లి విజయలక్ష్మి ఈరోజు మధ్యాహ్నం గుండెపోటుతో మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని నటి రజిత సోషల్ మీడియా వేదికగా తెలియచేయడం జరిగింది.. దీంతో పలువురు సెలబ్రిటీలతో పాటుగా అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు

రజిత 18 ఏళ్ల వయసులోనే వెండితెర పైకి ఎంట్రీ ఇచ్చింది ఈమె నటించిన మొదటి చిత్రం బ్రహ్మ రుద్రుడు ఇందులో ఈమె అక్కినేని నాగేశ్వరరావు కుమార్తెగా నటించిందట. ఆ వెంటనే పలు చిత్రాలలో నటించి సుమారుగా 200 లకు నటించింది. పెళ్ళికానుకగా చిత్రానికి ఈమెకు ఉత్తమ నటి గా కూడా రజిత అవార్డు అందుకున్నది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలలో నటించిన నటి రజిత సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో కృష్ణవేణి , రాగిణి వంటి వారు విజయలక్ష్మి కి చెల్లెలు అవుతారట.

నటి రజిత కెరియర్ లో చెప్పుకోదగ్గ చిత్రాల విషయానికి వస్తే ప్రేమఖైదీ, పెళ్లి సందడి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వర్షం, సరైనోడు వీర సింహారెడ్డి తదితర చిత్రాలు కూడా ఉన్నాయట చివరిగా ఈమె ఉష పరిణయం అనే చిత్రంలో నటించింది. తమిళంలో అయితే పలు చిత్రాలలో నటించిన నటి రజిత మలయాళ ,హిందీ, బెంగాలీ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటించింది. వాస్తవానికి ఈమె ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి  జిల్లా.. అయితే ఈమె తండ్రి చిన్న వయసులోనే మరణించడంతో తల్లి దగ్గరుండి ఈమెను చదివించిందట. చదువు పూర్తి అయిన తర్వాత డాక్టర్ కావాలనుకున్నప్పటికీ .. కానీ వీరి కుటుంబంలోని కృష్ణవేణి, రాగిణి వంటి వారు కూడా ఇండస్ట్రీలో రాణిస్తూ ఉండడంతో రజితకు కూడా అవకాశాలు కల్పించారట.అలా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: