మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ తర్వాత మరింత జోష్ గా కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. యువ హీరోలు సైతం చిరంజీవికి పోటీ పడలేకపోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో 7 సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రస్థానంలో మరో న్యూ ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నారు. రీసెంట్‌గా చేసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో బాక్సాఫీస్ హవా చూపించిన చిరు, ఈ సారి యువతరం దర్శకులతో కొత్త ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ నేపథ్యంలో ఇక కామెడీ యాక్షన్ సినిమాల మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ ఖరారైంది.అలాగే దసరా సినిమాతో డైరెక్టర్‌గా తన ప్రతిభను చూపించిన శ్రీకాంత్ ఓదెల , మెగాస్టార్‌తో ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అదేవిధంగా, వెంకీ కుడుముల , సందీప్ రెడ్డి వంగా వంటి డైరెక్టర్లు కూడా మెగాస్టార్‌తో సినిమాలకు సిద్ధమవుతున్నారు. చిరు ఈ సారి కొత్త కథాంశాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలని భావిస్తున్నారు. యువతర దర్శకుల కొత్త ఆలోచనలు చిరు స్టార్డమ్‌తో కలిస్తే, తెలుగు సినీ పరిశ్రమలో మరో క్రేజీ లైనప్ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
ఇదిలావుండగా మల్లిడి వశిష్టతో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమానే 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతుంది.విశ్వంభర ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. టీజర్‌లోని ఫాంటసీ, గ్రాఫిక్స్ అంశాలతో పాటు చిరంజీవిపై తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతికి వాయిదాపడిన విశ్వంభర మూవీని మే 9న రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మే 9న చిరంజీవి జగదేకరుడు అతిలోక సుందరి రిలీజైంది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ప్రొడ్యూసర్లు ఉన్నట్లు సమాచారం.ఇదిలావుండగా విశ్వంభర మూవీని దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాలో చిరంజీవివి జోడీగా త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.