మెగా కుటుంబాన్ని తొక్కేసిన పుష్ప 2... బన్నీని తట్టుకోవడం ఇక కష్టమే?
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా కుటుంబం సపోర్ట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అర్జున్.... ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. మెగా బ్రాండ్... నుంచి బయటికి వచ్చి అల్లు బ్రాండ్ వేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి నుంచి ఇప్పటివరకు.. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినిమాలు చేసి.. సక్సెస్ఫుల్ హీరోగా నిలిచాడు. ఈ తరుణంలోనే తాజాగా... పుష్ప 2 సినిమాతో.. టాలీవుడ్ ఇండస్ట్రీ నే కాదు ఇండియాను షేక్ చేశాడు.
ఈ సినిమా ఒక్క రోజులలోనే 250 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఒక్కరోజే 250 కోట్లు వసూలు చేసిన సినిమా...ఇప్పటివరకు ఏదీ లేదు.ఒకవేళ అదే నిజమైతే... ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీ గా పుష్ప 2 నిలుస్తుంది. నిన్నటి నుంచి థియేటర్లలో నడుస్తున్న పుష్పకు మంచి ఆదరణ. విమర్శలు చేసిన వారు కూడా...సినిమా బాగుందని చెబుతున్నారు.అంతెందుకు మెగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం..ఎగబడుతున్నారు.
అయితే మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత...అల్లు కుటుంబం పైన ఎదురు దాడి చేసింది మెగా కుటుంబం.పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయకుండా వైసిపికి సపోర్ట్ చేసినందుకు బన్నీని టార్గెట్ చేశారు. అయితే 2000 కోట్లు సాధించగల సత్తా ఉన్న పుష్ప 2 సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో...ఒక అడుగు ముందుకేసి వైసిపికి అల్లు అర్జున్ ప్రచారం చేశాడు.ఇది పెద్ద సాహసం అని చెప్పవచ్చు. వ్యతిరేకత వచ్చినప్పటికీ.. ఎక్కడ తగ్గలేదు బన్నీ.
అటు జనసేన, మెగా అభిమానులు ఈ సినిమాను ఏపీలో అడ్డుకుంటామని ప్రకటించారు.మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని కూడా అల్లు అర్జున్ ను డిమాండ్ చేశారు.కానీ ఈ విషయంలో సినిమాను నమ్ముకున్న బన్నీ తగ్గలేదు. అందుకే మెగా కుటుంబాన్ని తొక్కుకుంటూ సక్సెస్ అయ్యాడు అల్లు అర్జున్. ఇంత వ్యతిరేకతలో కూడా పుష్ప 2 బంపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.