అరెరె..చిన్న వయసులోనే..శ్రీ లీలను కూడా ఆ దోమ కుట్టినట్టుందే..!

Thota Jaya Madhuri
ఎప్పుడు వచ్చామా అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా..? ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో మనకు తెలిసిందే.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలోని ఈ డైలాగ్  బాగా హిట్ అయ్యింది. అయితే ఇదే డైలాగ్ ఇప్పుడు శ్రీలీల పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది. ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చామా ..? అన్నది పాయింట్ కాదు మాటలతో టెంప్ట్ చేసి మెల్ట్ చేసామా..? అవకాశాలు పట్టేసామా ..? అదే ఇంపార్టెంట్ అన్న రేంజ్ లో పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ను స్పీచ్ ఉన్నింది. సూపర్ హైలెట్గా నిలిచింది.


 శ్రీ లీల ఈవెంట్ కి  హైలెట్ గా మారింది అని చెప్పడంలో సందేహమే లేదు . చాలా నాటిగా సారీ కట్టి నడుము వంపులతో తన వయ్యారాలతో కుర్రాలను ఫిదా చేసి పక్కన పడేసింది . అంతేకాదు తెలుగులో స్పీచ్ ఇచ్చి అదరహో అనే రేంజ్ లో ఆకట్టుకునింది. పుష్ప 2 సినిమాలో శ్రీ లీల స్పెషల్ సాంగ్ లో కనిపించిన విషయం అందరికీ తెలిసిందే.  అయితే సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన్నాకు ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో అంతే ప్రిఫరెన్స్ శ్రీలీల కి కూడా ఇచ్చారు. పుష్ప 2 టీం  ఎక్కడికి వెళ్తున్న శ్రీలీలను వెంటబెట్టుకొని వెళ్లడం.. పుష్ప2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగినప్పుడు ఆమెను స్పెషల్ గా రిసీవ్ చేసుకోవడం ..చాలా చాలా హైలెట్గా మారింది .


అయితే స్టేజ్ ఎక్కిన శ్రీలీల పుష్ప2 సినిమాను ఓ  రేంజ్ లో పొగిడేసింది . పెనం మీద వేడిగా ఉన్నప్పుడే విజిల్స్ పడతాయి .. మీ సినిమా చూసి కూడా మేము విజిల్స్ వేయడానికి రెడీగా ఉన్నాము అంటూ నాటి నాటి డైలాగ్స్ కూడా వాడింది . శ్రీలీల స్పీచ్ చూస్తుంటే ఆమెకు ఇండస్ట్రీ సాంప్రదాయం అర్థం అయిపోయినట్లు అనిపిస్తుంది.  పబ్లిసిటీ ప్రమోషన్స్ అనే దోమ ఆమెకి బాగా ఎక్కిసినట్లు అనిపిస్తుంది అంటున్నారు జనాలు . అందుకే నిన్న మొన్నటి వరకు స్టేజ్ ఎక్కితే సైలెంట్ గా ఉండే శ్రీలీల పుష్ప2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం రెచ్చిపోయి మరి మైక్ పట్టుకొని ఊపేసింది అంటున్నారు . మొత్తానికి పబ్లిసిటీ పొగిడేయ్యాలి అన్న దోమ  శ్రీ లీలా కి కూడా కుట్టేసినట్లే ఉంది అంటూ ఆమెను ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తూ ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: