ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొన్ని సంవత్సరాల క్రితం పుష్ప పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే తాజాగా పుష్ప పార్ట్ 1 మూవీ కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 సినిమాను రూపొందించారు. ఈ సినిమాని రేపు అనగా డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను కొన్ని ప్రాంతాలలో ఈ రోజు రాత్రి నుండే ప్రదర్శించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాతో అల్లు అర్జున్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ సేల్స్ తోనే ఈ సినిమాకు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇది వరకు అల్లు అర్జున్ నటించిన ఏ సినిమాకు కూడా ప్రీ సేల్స్ తో ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు రాలేదు. దానితో అల్లు అర్జున్ కెరీర్ లోనే విడుదలకు ముందు ప్రీ సేల్స్ తోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకున్న సినిమాల లిస్టులో ఈ మూవీ చేరింది.
ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ టాక్ ను తెచ్చుకుని ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ లో ఫాహాద్ ఫజిల్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.