ఏపీ టీడీపి: అధికారంలో ఉన్న పార్టీకి అమ్మా ..కొడుకు గుడ్ బై..!
ఇక ఆ కుటుంబం ఏదో కాదు బద్వేల్ మాజీ ఎమ్మెల్యే కోనిరెడ్డి విజయమ్మ ఆయన కుమారుడు రేవంత్ రెడ్డి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వీరు బయటికి రావాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఉమ్మడి కడప జిల్లాలో బద్వేల్ టిడిపి పార్టీ రాజకీయాలు అంటే దివంగత మాజీ ఎమ్మెల్యే కోనిరెడ్డి వీరారెడ్డి పేరే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మృతి చెందడంతో అయన రాజకీయ వారసురాలిగా కుమార్తె విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2004లో ఆమె ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత బద్వేల్ రిజర్వేషన్ తో మారడంతో టీడీపీ నుంచి ఎస్సీ, ఎస్టీ నుంచి నేతలు పోటీ పడుతున్నప్పటికీ అక్కడ పెత్తనం మొత్తం వీరిదే కొనసాగేదట.
అయితే అలా 2004, 2009, 2014, 2019, 2024 లో కూడా వరుసగా ఐదుసార్లు టిడిపి ఓడిపోయింది. అయితే ఈ ఐదు సార్లు కూడా విజయమ్మ టిడిపి పార్టీని అక్కడ కంట్రోల్లో ఉన్నదట. వారు చెప్పిన వారికి టిడిపి సీటు ఇస్తున్నప్పటికీ ఈ ఏడాది ఎన్నికలలో బిజెపి నుంచి పోటీ చేసిన బొజ్జ రోశన్న కూడా ఓడిపోయారు.. కడప జిల్లాలో పులివెందులతో పాటుగా బద్వేల్ లో టిడిపి ఓడిపోయింది. బద్వేల్ లో టిడిపి ఓడిపోవడం సీఎం చంద్రబాబుకు నచ్చలేదట.. అందుకే పార్టీ ఇన్చార్జిలుగా ఉన్న రితేష్ రెడ్డితో పాటు విజయమ్మ చెప్పిన పనులు అధికారులు చేయవద్దంటూ కూడా ఆదేశాలను జారీ చేసినట్లు సమాచారం. ఇవన్నీ తెలియడంతో పార్టీలో ఉన్న ఏ ప్రయోజనం లేదని.. రితేష్ రెడ్డి టిడిపి నుంచి బయటికి రావాలని ఆలోచనతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఏంటి అన్నది తెలియాల్సి ఉంది..