రాజమౌళికి మించిన క్రేజ్ సుక్కుకి లాభమా.. నష్టమా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో రాజమౌళి , సుకుమార్ ప్రథమ స్థానాల్లో ఉంటారు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక వీరు దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకోవడంతో వీరిద్దరికి కూడా ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది. దానితో వీరి దర్శకత్వంలో రూపొందిన సినిమాలకు అదిరిపోయి రేంజ్ బిజినెస్ కూడా జరుగుతూ ఉంటుంది.

ఇకపోతే కొంత కాలం క్రితం రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కంటే ముందు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి పార్ట్ 2 సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని ఉండడంతో ఈ సినిమాకు ఏకంగా 450 యొక్క కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అప్పటివరకు ఏ తెలుగు సినిమాకు కూడా ఈ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. ఇకపోతే సుకుమార్ కొంతకాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా పుష్ప పార్ట్ 1 అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక సుకుమార్ ఈ సినిమాకు కొనసాగింపుగా తాజాగా పుష్ప పార్ట్ 2 మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానితో ఈ సినిమాకు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు కూడా ఈ స్థాయి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు.

ఇక ఈ సినిమాతో సుకుమార్ , రాజమౌళి సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ను భారీ మార్జిన్ తో దాటేశాడు. ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ మూవీ కి జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే చాలా పెద్ద మొత్తంలో షేర్ కలక్షన్లు వచ్చాయి. ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మరి పుష్ప పార్ట్ 2 మూవీ జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలక్షన్లను వసూలు చేసి హిట్ స్టేటస్ను అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: