మెగాస్టార్ - శ్రీకాంత్ 'బ్లడ్ ప్రామిస్'.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!
మెగాస్టార్ చిరంజీవి ఒక వైపు తన కెరీర్ లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇప్పుడీ ప్రాజెక్ట్ లో కూడా చిరు కొత్తగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. పోస్టర్ లో కనిపిస్తున్న రక్తపూత చేతులలోనే కథ ప్రధాన అంశం దాగి ఉందని భావిస్తున్నారు. సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. నాని చేసిన "బ్లడ్ ప్రామిస్" కామెంట్ ఈ ప్రాజెక్ట్ మీద మరింత సస్పెన్స్ కలిగించింది.'దసరా' సినిమాతో డైరెక్టర్ గా తన టాలెంట్ చూపించిన శ్రీకాంత్ ఓదెల, ఇప్పుడు చిరంజీవితో తన రెండో చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సినిమా కథను విన్న చిరంజీవి సింగిల్ సిట్టింగ్ లో ఓకే చెప్పడం ఈ ప్రాజెక్ట్ పై చిరు పెట్టిన నమ్మకానికి నిదర్శనం. శ్రీకాంత్ డైరెక్షన్ లో చిరు ఎలా కనిపిస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్ తో, శ్రీకాంత్ ఓదెల క్రియేటివ్ టచ్ తో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని టాక్. ఈ బ్లడ్ ప్రామిస్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ సినిమా ప్రకటనకు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా విడుదల కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.